Begin typing your search above and press return to search.

రష్యాను చావుదెబ్బ కొట్టిన చిట్టెలుక

By:  Tupaki Desk   |   10 May 2022 7:30 AM GMT
రష్యాను చావుదెబ్బ కొట్టిన చిట్టెలుక
X
సుమారు పది రోజుల వ్యవధిలోనే రష్యాను చిట్టెలుక ఉక్రెయిన్ రెండోసారి చావు దెబ్బ కొట్టింది. ఈమధ్యనే నల్ల సముద్రంలో నిలిపిఉన్న రష్యా యుద్ధనౌక మస్కోవాను పేల్చిసిన ఉక్రెయిన్ సైన్యం సోమవారం మరో యుద్ధనౌక అడ్మిరల్ మార్కోవ్ (సెర్నా) ను ధ్వంసం చేసేసింది. తమ డ్రోన్ల క్షిపణుల ద్వారా తాజాగా ధ్వంసం చేసిన యుద్ధనౌక దృశ్యాలను ఉక్రెయిన్ మిలిటరీ ట్విట్టర్లో పెట్టడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

నిజానికి నల్ల సముద్రంలో ఉక్రెయిన్ తీరానికి సుమారు 200 మైళ్ళ దూరంలో నిలిపి ఉంచిన యుద్ధ నౌకలను కూల్చేయటం ఉక్రెయిన్ సైన్యానికి ఏమాత్రం సాధ్యంకాదు. ఎందుకంటే పదిరోజుల క్రితం పేల్చేసిన యుద్ధనౌకైనా, తాజాగా ధ్వంసం చేసిన యుద్ధనౌకైనా రష్యాకు చాలా చాలా కీలకమైనవే.

పదిరోజుల క్రితం పేలిపోయిన యుద్ధనౌక కన్నా ఇపుడు ధ్వంసమైపోయిన నౌకే చాలా అధునాతనమైనది, ఎంతో విలువైనది కూడా. ఈ రెండు యుద్ధ నౌకలను కూల్చేసేంత పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ దగ్గర లేదు.

అయినా పదిరోజుల వ్యవధిలో రెండు యుద్ధనౌకలను ఎలా కూల్చగలిగింది ? ఎలాగంటే కేవలం అమెరికా సాయంతోనే అన్నది అందరికీ తెలిసిపోతోంది. అమెరికా అందించిన సాంకేతిక సాయంతో, అందించిన అత్యంధునాతన మిసైల్ టెక్నాలజీ ద్వారా, శత్రుదేశాల యుద్ధ నౌకలను పసిగట్టి పేల్చేయ గలిగిన శక్తిమంతమైన వార్ హెడ్లు కలిగిన క్షిపణలను అమెరికా నుండి ఉక్రెయిన్ అందుకున్నది. రెండు నౌకలను కూల్చేయటంలో కూడా అమెరికా సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉపయోగపడింది.

ఇంతకన్నా ముందు అమెరికా శాటిలైట్ల ద్వారా రష్యా యుద్ధనౌకలు నల్ల సముద్రంలో ఎక్కడ ఉన్నాయో క్లిస్టర్ క్లియర్ గా అమెరికన్ నిపుణులు ఉక్రెయిన్ మిలిటరీకి ఉప్పందించారు. అలాగే డ్రోన్ల ద్వారా లేజర్ కిరణాలను నేరుగా రష్యన్ యుద్ధనౌకల మీదకు పంపి స్పాట్ ను 100 శాతం యాక్యురసీగా చూపించారు.

అమెరికా డ్రోన్ల ద్వారా ముందు లేజర్ కిరణాల పంపి వాటి దృష్టిమళ్ళించగానే ఉక్రెయిన్ సైన్యం క్షిపణలను ప్రయోగించి యుద్ధ నౌకలను ధ్వంసం చేశారు. రెండు యుద్ధ నౌకలను కోల్పోవటం రష్యాకు చావుదెబ్బ లాంటిదనే చెప్పాలి. మరి దీనికి రష్యా ఏ విధంగా రియాక్టవుతుందో చూడాల్సిందే.