Begin typing your search above and press return to search.

ఈయూలోకి ఉక్రెయిన్.. అధ్యక్షుడి కీలక సంతకం..

By:  Tupaki Desk   |   1 March 2022 7:44 AM GMT
ఈయూలోకి ఉక్రెయిన్.. అధ్యక్షుడి కీలక సంతకం..
X
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో ఆ దేశంలో పరిస్థితులు దిగజారాయి. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికి వారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు.

ఆ తదుపరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జెలెన్స్కీ దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తు పై సంతకం కూడా చేశారు.

ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్, ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ చైర్మన్ రుస్లాన్ స్టెఫాన్ చుక్ సమక్షంలో ఈ దరఖాస్తుపై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం’’ అని ట్యాగ్ ను జోడించి మరీ పోస్ట్ చేశారు.

ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ కూడా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం దరఖాస్తును దాఖలు చేసింది. ఈ దరఖాస్తుపై ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంతకం చేశారు. ఈ దరాఖాస్తును యూరోపియన్ యూనియన్ కమిషన్ కు పంపించారు. సంతకం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇదొక చారిత్రాత్మక సందర్భంగా అభివర్ణించారు. ఈయూలో తక్షణమే సభ్యత్వాన్ని కల్పించాలంటూ డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ దరఖాస్తుపై సంతకం చేశారు.

ఈ చర్య రష్యాను మరింత రెచ్చగొట్టినట్టువుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ సిద్ధపడడం వల్లే రష్యా ఆ దేశంపైకి దండెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం దరాఖాస్తు చేసుకోవడం ఆగ్రహావేశాలకు గురిచేస్తుందనే అభిప్రాయాలున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడినందుకు గానూ రష్యాని ప్రపంచ దేశాలు దౌత్యపరంగా ఆర్థికపరమైన విషయంలో ఏకాకిని చేసింది.అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యాన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాల జాబితాలో చేరాయి.