Begin typing your search above and press return to search.

రష్యాకు ఉక్రెయిన్ షాక్: 10వేల మంది సైనికులు హతం

By:  Tupaki Desk   |   6 March 2022 3:30 PM GMT
రష్యాకు ఉక్రెయిన్ షాక్: 10వేల మంది సైనికులు హతం
X
ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా వైపు నుంచి కూడా అపార ప్రాణ నష్టం వాటిల్లుతోందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై నేటికి పదోరోజు అయ్యింది. రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత అది మరింత చెలరేగిపోతూ విరుచుకుపడుతోంది. పుతిన్ సేనలకు ఉక్రెయిన్ సైన్యం తెలివిగా దెబ్బతీస్తోంది.

ఈ క్రమంలోనే ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 10వేల మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం 10వ రోజులోకి ప్రవేవించగా తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ మాత్రం తమ సాయుధ బలగాల మరణాల గణాంకాలను మాత్రం విడుదల చేయలేదు.

ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసినప్పటి నుంచి 10వేల మంది రష్యన్ సైనికులు మరణించారని.. 39 యుద్ధ విమానాలు, 40 హెలిక్యాప్టర్లతో సహా 1870 యూనిట్ల భారీ , తేలికపాటి సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ శనివారం తెలిపింది.

ఉక్రెయిన్ సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ రష్యాకు చెందిన 39 విమానాలు, 40 హెలిక్యాప్టర్లు, 269 ట్యాంకులు, 945 సాయుధ వాహనాలు, 105 ఫిరంగ వ్యవస్థలు, 409 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు ధ్వంసమయ్యాయి. మూడు మానవరహిత వైమానిక వాహనాలు కూడా నిలిపివేయబడ్డాయి.

ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి 24న యుద్ధం ప్రకటించింది. అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీసింది. బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సహాయాన్ని అందించాయి. అయితే యుద్ధం ఆపేది లేదని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 331 మంది పౌరులు మరణించారు. 675మంది గాయపడ్డారు. 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు పారిపోయారు.