Begin typing your search above and press return to search.
మరింత గందరగోళంలో ఉక్రెయిన్ విద్యార్థులు
By: Tupaki Desk | 7 Sep 2022 5:35 AM GMTఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థుల పరిస్ధిత మరింత గందరగోళమైపోయింది. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్ధులకు వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు జాతీయ వైద్య మండలి తాజాగా ఒక ప్రకటన చేసింది. ఆ నిర్ణయం వల్ల విద్యార్ధులకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలీదుకానీ నష్టం మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందనుకోవాలి. ఇంతకీ మండలి తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి వచ్చేసిన విద్యార్ధులు మిగిలిన కోర్సును ఏ దేశంలో అయినా (టెంపరరీ రీ లొకేషన్) పూర్తిచేయచ్చట.
మిగిలిపోయిన కోర్సును విద్యార్దులు ఏ దేశంలో చేసినా ఉక్రెయిన్ కాలేజీల్లో చదివినట్లుగానే పరిగణిస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల విద్యార్ధులకు జరిగే మేలు ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే యుద్ధం మొదలయ్యే నాటికి అక్కడ వైద్య విద్య చదువుతున్న విద్యార్ధులు పరీక్షలు రాయకుండా వచ్చేయాల్సొచ్చింది. యుద్ధం మొదలయ్యే నాటికి మహా అయితే కొన్ని నెలల కోర్సు+పరీక్షలు రాయటం మాత్రమే మిగులుంది.
యుద్ధం కొన్ని నెలలు ఆలస్యంగా మొదలయ్యుంటే కోర్సు కంప్లీట్ అయిపోయి పరీక్షలు కూడా రాసేసుండేవారే. అర్ధాంతరంగా కాలేజీల నుండి ఇండియాకు తిరిగొచ్చేసిన విద్యార్ధులు సుమారు 16 వేల మందున్నారు.
తాజాగా వీళ్ళ విషయంలో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే మిగిలిపోయిన కొద్దినెలల కోర్సును విద్యార్ధులు ఏ దేశానికి వెళ్ళి చదువుతారు ? ఏ దేశమైనా కేవలం కొన్ని నెలలు మాత్రమే చదువుకుని పరీక్షలు రాస్తానని విద్యార్ధులు అడిగితే అంగీకరిస్తాయా ? ఆరేళ్ళు చదివి పరీక్షలు రాసి పాసైతేనే డిగ్రీలిస్తాయి కాని కొన్ని నెలలు చదివేసి పరీక్షలు రాయటానికి అనుమతించవు.
ఒకవేళ ఏ కారణంతో అయినా అనుమతించినా మొత్తం కోర్సు ఫీజును కడితే కానీ అంగీకరించవు. అంటే ప్రతి విద్యార్ధి మళ్ళీ లక్షల్లో ఫీజులు కట్టాల్సిందే. పైగా టెంపరరీ రీ లొకేషన్ కు అనుమతిస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించటమే విచిత్రంగా ఉంది. అసలు అనుమతించాల్సింది, గుర్తించాల్సింది ఉక్రెయిన్ కాలేజీలు.
మిగిలిన కోర్సును ఎక్కడో చదివితే తాము గుర్తించమని ఉక్రెయిన్ కాలేజీలంటే విద్యార్ధులు ఏమిచేయాలి ? విద్యార్ధులను గందరగోళంలోకి నెట్టేసేబదులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్ధులను ఆన్ లైన్లో కోర్సు పూర్తిచేసుకునేట్లుగా ఒప్పిస్తే సరిపోతుంది కదా. మన ప్రభుత్వం ఒత్తిడి పెడితే ఉక్రెయిన్ ప్రభుత్వం కాదంటుందా ?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.