Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ : మార్కెట్ పై మళ్లీ యుద్ధ ప్రభావం ! సిమెంట్ ధర సూడరో !

By:  Tupaki Desk   |   22 April 2022 6:30 AM GMT
ఉక్రెయిన్ : మార్కెట్ పై మళ్లీ యుద్ధ ప్రభావం ! సిమెంట్ ధర సూడరో !
X
యుద్ధ ప్ర‌భావం లేద‌ని అస్స‌లు చెప్ప‌వ‌ద్దు..ముంచుకు వ‌స్తున్న సంక్షోభాల‌న్నింటికీ కార‌ణం యుద్ధ‌మే ! కానీ భార‌త దేశం గుడ్ల‌ప్ప‌గించి చూస్తున్నంత మాత్రాన ఏవీ ఆగ‌వు క‌దా ! క‌నుక మ‌నం ఇప్పుడు ఆందోళ‌న చెందాల్సిన ప‌రిణామ‌మే యుద్ధం.ఆ విధంగా మార్కెట్ శ‌క్తుల‌ను నిలువ‌రించి, సంబంధిత ఉత్ప‌త్తి రంగాల‌ను విప‌రీతంగా న‌ష్టాల్లో కూరుకుపోయే విధంగా చేస్తున్న ప‌రిణామ‌మే యుద్ధం. కానీ ఇవేవీ ప‌ట్ట‌ని దేశాధినేత‌లు కూడా ఉన్నారు. ఇదే అదునుగా సాయుధ పోరు సాగించండి అని చెప్పే దేశాధినేత‌లు కూడా ఉన్నారు. అందుకే మార్కెట్ సూచీలు తీవ్ర ప‌తనాల‌ను చవి చూస్తున్నాయి.

దారుణం అయిన స్థితిగ‌తుల‌న్నీ మున్ముందు కూడా ఉండ‌నున్నాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త. ఉదాహ‌ర‌ణ‌కు సిమెంట్ వినియోగం పెరిగితే ఉత్ప‌త్తి కూడా అందుకు అనుగుణంగా ఉండాలి కానీ ఉత్ప‌త్తి ఇప్పుడు మ‌రింత ద‌య‌నీయావ‌స్థ‌కు చేరుకోవ‌డంతో భ‌వ‌న నిర్మాణ రంగ‌మే కాదు చాలా రంగాలు త‌మ ఉనికిని కోల్పోవాల్సి వ‌స్తోంది. క‌రోనా త‌రువాత కోలుకుంటున్న మార్కెట్ల‌కు యుద్ధం ఓ చావు దెబ్బ!మేల్కోండి దేశాధ్య‌క్షులారా ! యుద్ధాన్ని నిలువ‌రించండి ప్లీజ్ ! న‌ర మేధాన్ని ఆపండి.. నిర్జీవ కాండ‌ను నిలువ‌రించ‌డం మ‌రువ‌కండి ! ప్లీజ్ .. ప్లీజ్ !

విధ్వంస కాండ‌ల కొన‌సాగింపుల్లో ఆ రెండు దేశాలూ ఉన్నాయి. అటు ఉక్రెయిన్ ఇటు ర‌ష్యా నువ్వంటే నువ్వు అని కొట్టుకు ఛ‌స్తున్నాయి. నిలువ‌రింత‌కు ఏ దేశం కూడా ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఆ విధంగా చేయ‌క‌పోవ‌డ‌మే ఓ విడ్డూరం.

అందుకే భార‌తీయ మార్కెట్ నే కాదు మిగ‌తా వినిమ‌య ప్రపంచాన్నీ శాసిస్తోంది యుద్ధం మ‌రియు సంబంధిత ప‌రిణామ గ‌తి ! ఈ నేప‌థ్యంలో వంట నూనెల ధ‌ర‌లు కానీ, ఆ మాట‌కు వ‌స్తే పెట్రో ధ‌ర‌లు కానీ అనియంత్రిత ప్రావ‌స్థ‌లో ఉన్నాయి. ఇప్పుడు సిమెంట్ ధ‌ర కూడా పెర‌గ‌నుంద‌ని మార్కెట్ లో సుప్ర‌సిద్ధ విశ్లేష‌క వ‌ర్గాలు చెబుతున్నాయి. నిర్థారిస్తున్నాయి. ఇందుకు కార‌ణాలు అనేకంగా ఉన్నాయి.సిమెంట్ ఉత్ప‌త్తికి సంబంధించి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే బొగ్గు, పెట్రోకోక్ దిగుమ‌తి ధ‌ర‌లు అన్న‌వి రోజురోజుకూ పెరుగుతున్నాయి.

యుద్ధం నేప‌థ్యంలోనే ఇవి పెరుగుతున్నాయి అని చెబుతున్నాయి విశ్లేష‌క వర్గాలు. దీంతో త్వ‌ర‌లో సిమెంట్ బ‌స్తా ధ‌ర ఇర‌వై ఐదు రూపాయ‌ల నుంచి యాభై రూపాయ‌ల‌కు పెరిగేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. తాజా అంచ‌నా ప్ర‌కారం రానున్న కాలంలో నాలుగు వంద‌ల రూపాయ‌లు ప‌లుకుతున్న బ‌స్తా ధ‌ర 425 నుంచి 450కు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. దీని ప్ర‌భావం మార్కెట్ పై ప‌డ‌నుంది. రానున్న కాలంలో ఆరు నుంచి ఏడు శాతం వినియోగం పెర‌గ‌నుంది. అంతే స్థాయి ఉత్ప‌త్తి ఉండ‌నుందా ?

లేదా అన్న‌ది ఇప్ప‌టి సంశ‌యం. ముడి స‌రుకు దిగుమ‌తికి సంబంధించి ఇప్ప‌టికే కొన్ని సందేహాలు ఉన్నాయి. అవ‌న్నీ యుద్ధం మోసుకు వ‌చ్చిన అనుమాన‌పు జాడలే కావ‌డం విచార‌క‌రం. క‌నుక స్థానిక ప్ర‌భుత్వాలు చేపట్టే ఇళ్ల నిర్మాణంపై కూడా పెరగ‌నున్న ధ‌ర‌ల ప్ర‌భావం పుష్క‌లంగా ఉండ‌నుంది. ఇదే అదునుగా మార్కెట్లో కృత్రిమ కొర‌త సృష్టించిన ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.