Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. అంతర్జాతీయ కోర్టులో భారత ఓటెటంటే..?

By:  Tupaki Desk   |   17 March 2022 11:29 AM GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. అంతర్జాతీయ కోర్టులో భారత ఓటెటంటే..?
X
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)కు ఎక్కింది. ఆపై రష్యా దీనిని సైనిక చర్యగా సమర్థించుకున్నా.. ఉక్రెయిన్ యుద్ధంగానే పేర్కొంటోంది. చివరకు అంతర్జాతీయ కోర్టు ఏం చెబుతుందో అనేది అందరూ చూశారు. సభ్య దేశాల జడ్జిల ఓటు కూడా ఆసక్తికరంగా మారింది.భారత్‌.. అంతర్జాతీయ వ్యవహారాల్లో సహజంగా తటస్థ వైఖరితో ఉంటుంది. అఅంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన ఉక్రెయిన్‌ రష్యా వ్యవహారంలో కూడా అలానే ఉండాలనుకుంది. వాస్తవానికి రష్యా.. భారత్ కు సహజ మిత్ర దేశం. ఉక్రెయిన్ తో సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సమావేశాల్లో భారత్‌ రష్యా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఖండించమే కాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిందే తప్ప ఓటింగ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. దీంతో తటస్థ వైఖరి సమర్థనీయం కుడా.

కానీ, అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ నామినేట్‌ చేసిన బడ్జి ఊహించని షాక్‌ ఇచ్చారు. కాగా, ఉక్రెయిన్‌ పై దాడిని నిలిపివేయాలని బుధవారం అంతర్జాతీయ ఉన్నత న్యాయస్థానం(ఐసీజే) రష్యాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బల ప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ భూభాగంలో ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తుందని స్పష్టం చేసింది.

అయితే ఈ కేసులో తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ప్రిసైడింగ్ జడ్జి జోన్ డోనోఘ్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి తెలిపారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌ పై దాడి చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కైవ్‌ అంతర్జాతీయ న్యాయంస్థానంలో ఫిర్యాదు చేసింది. అయితే మాస్కో ఐసీజేకి అధికార పరిధి లేదంటూ వాదిస్తూ ఉంది. కానీ ఐసీజే ఈ కేసులో అధికార పరిధిని కలిగి ఉందని తీర్పునివ్వడమే గాక ఉక్రెనియన్ భూభాగంలో మారణహోమం జరిగినట్లు రష్యన్ ఫెడరేషన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గట్టి కౌంటరిచ్చింది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకోవడం తోపాటు కైవ్‌లోని నివాస భవనాలపై రష్యా దళాలు దాడులను పెంచడంతో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్‌ తన తటస్థ వైఖరికి భిన్నంగా ఓటు వేసింది.

ఈ మేరకు ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ భండారీ పూర్తిగా ప్రభుత్వం, వివిధ మిషన్ల మద్దతుతో ఐసీజేకి నామినేట్ అయ్యారు. జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పైగా ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా ఇవన్నీ స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం వైఖరికి భిన్నంగా ఉందని స్పష్టమైపోయింది. దీంతో ఇప్పటివరకు తటస్థ రాగం ఆలపించిన భారత్‌కు భారీ షాక్‌ తగిలింది.

ఇక ఉక్రెయిన్ పై రష్యా ఎడ తెగకుండా యుద్ధం చేస్తునే ఉంది. క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఓపక్క చర్యలు జరుపుతునే రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం ఆగటంలేదు. అమెరికా సహా పలు దేశాల సూచనలు పనిచేయడం లేదు. రష్యా మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. ఈ క్రమంలో రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించి అంశం కాస్తా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. ఉక్రెయిన్ గడ్డపై రష్యా నరమేధానికి పాల్పడుతోంది అంటూ పిటిషన్ దాఖలైంది. పశ్చిమ ఐర్లాండ్ లోని హేగ్ నగరంలోని అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అమెరికాకు చెందిన జడ్జి జోన్ డోనోగ్ మాట్లాడుతూ..యుక్రెయిన్ పై ఆయుధాలను ప్రయోగించడాన్ని రష్యా తక్షణమే ఆపేయాలని అంతర్జాతీయ ధర్మాసనాన్ని కోరారు. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను సైతం దెబ్బతీసేలా ఉన్నాయని విన్నవించారు. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్-రష్యా సమస్యపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. యుద్దానికి బదులు చర్చలపై దృష్టి పెట్టి ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకోవాలని అటు రష్యా..ఇటు యుక్రెయిన్ లకు భారత్ సూచించింది. రష్యా అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము యుద్ధం చేసేది పంతంతో కాదని ఆత్మరక్షణ కోసమేనని స్పష్టంచేసింది.

దీన్ని ఉక్రెయిన్ ఖండించింది. తమ దేశంలో పలు కీలక నగరాలపై మారణ హోమం జరిగిందని వెల్లడించింది. రష్యా తన యుద్ధాన్ని సమర్థించుకోవటానికి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అంటూ ఆరోపించింది. దీనిపై రష్యాపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని యుక్రెయిన్ కోరింది. యుద్ధాన్ని ఆపడంలో న్యాయస్థానం పాత్ర ఎంతో ఉందని యుక్రెయిన్ ప్రతినిధి ఆంటోన్ కోరినెవిజ్ అంతర్జాతీయ ధర్మాసనాన్ని కోరారు. ఈ వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం స్పందిస్తూ..‘ రష్యా యుక్రెయిన్ లో భూభాగంలో మారణహోమం జరిగినట్టు రుజువు చేసే సాక్ష్యాలు తమ వద్ద లేవని వెల్లడించింది. అయినా రష్యా యుక్రెయిన్ లో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అమెరికాకు చెందిన జడ్జి జోన్ డోనోగ్ స్వాగతించారు. కోర్టు ఉత్తర్వులను 13మంది న్యాయమూర్తులు సమర్థించారు. ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం వ్యతిరేకించారు.