Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ యుద్ధం: భారతీయుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 17 Feb 2022 7:00 AM ISTరష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే భారతీయులను రక్షించేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ లోని భారతీయులకు భరోసా కల్పించింది.
రష్యా -ఉక్రెయిన్ ల ఉద్రిక్తల నడుమ రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉంచిదంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఓ పక్కన అమెరికా యుద్ధం తప్పదు అంటూ వరుస హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి వచ్చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారతీయ విద్యార్థులు సమాయత్తమవుతున్నారు.
అయితే ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రజలకు విమానాలు అందడం లేదని ట్విట్టర్ లో పేర్కొంది. దీంతో కేంద్రం పౌరులను విమాన టిక్కెట్లు దొరకడం లేదని భయపడవద్దని మరిన్ని విమానాలను పంపించేందుకు యత్నిస్తున్నామని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి విమానాలు అందుబాటులో లేవని భారత రాయబార కార్యాలయానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. విద్యార్థులను భయాందోళనలకు గురికావద్దని.. భారత్ కు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అనుకూలమైన విమానాలను బుక్ చేసుకోండని ట్వీట్ చేసింది. ఉక్రెనియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్ వేస్ మొదలైనదవి విమానాలు నడుపుతున్నాయని పేర్కొంది.
సమీప భవిష్యత్తులో మరిన్ని విమానాలు నడిపేందుకు యత్నించనుందని కూడా కేంద్రం వెల్లడించింది. అంతేకాదు ఏదైనా సమాచారం కోసం.. సహాయం కోసం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కూడా సంప్రదించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 24 గంటలు హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసింది.
మరోవైపు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత రష్యా ఆధీనంలోని క్రిమియాలో సైనిక కసరత్తులు ముగిశాయని.. సైనికులు తమ స్థావరాలకు తిరిగి వస్తున్నారని తెలుపడం విశేషం.