Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధం.. కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ

By:  Tupaki Desk   |   3 May 2022 3:29 AM GMT
ఉక్రెయిన్ యుద్ధం.. కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ
X
దేశం కాని దేశంలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి ఆయన తాజాగా ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. తాజాగా జర్మనీ ఛాన్స్ లర్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ యుద్ధంపై ఎవరూ ఊహించలేని రీతిలో రియాక్టు అయ్యారు. ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఓడిపోవటమే తప్పించి.. విజయం సాధించేలేదని స్పష్టం చేశారు.

యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని.. అందరూ నష్టపోవటమే తప్పించి ఇంకేమీ ఉందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకాలంటే.. అందుకు చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించాలని ఇరు దేశాలకు చెప్పటంతో పాటు.. భారత్ శాంతిని మాత్రమే కోరుకుంటుందన్న విషయాన్ని తేల్చి చెప్పటం గమనార్హం.

మూడు రోజుల యూరోప్ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా జర్మనీ ఛాన్స్ లర్ తో భేటీ కావటం.. దైపాక్షి ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు వ్యక్తిగత స్థాయిలో చర్చలు జరిపారు.

అనంతరం ఇరువురు కలిసి ఉమ్మడిగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. భారత్ తమ కీలక భాగస్వామిగా పేర్కొన్న జర్మనీ ఛాన్స్ లర్.. కొన్ని శక్తివంతమైన దేశాల మధ్య బంధాలే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించలేదన్నారు.

అదే సమయంలో అనేక దేశాల మధ్య ఉండే బంధాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని దేశాల వారు గుర్తు పెట్టుకోవాలన్నారు. జర్మనీలో జరిగే జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించారు. దేశం కాని దేశంలో ఉక్రెయిన్ యుద్ధం పై భారత్ స్పందనను సూటిగా చెప్పేసిన ప్రధాని మోడీ మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.