Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ : యుద్ధ సంభాషణల్లో భారత్ మౌనం ఎందుకు?
By: Tupaki Desk | 23 March 2022 9:31 AM GMTరష్యా - ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ యుద్ధం కారణంగా రష్యా ప్రపంచ దేశాలలో ఒంటరి అయిపోయింది. అదేవిధంగా అమెరికా కూడా కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసి పరువు పోగొట్టుకుంది. అమెరికా ప్రభావంతో కొంత, సొంత పట్టింపు మరియు పట్టుదలతో కొంత ఉక్రెయిన్ అనూహ్య పరిణామాలను ఎదుర్కొని మూల్యం చెల్లిస్తోంది.
దీంతో రష్యా ఓ విధంగా అనుకున్నది మరికొద్ది రోజుల్లోనే సాధించనుంది. అమెరికా మాత్రం ఇంకా రష్యాపై గొంతెత్తుతూ, వివాదంలోకి భారత్ ను కూడా నెమ్మదిగా తీసుకువచ్చేందుకు తెగ తాపత్రయపడుతోంది. అంటే ఇప్పుడు కొత్త శత్రువుల సృష్టి, పాత కలహాల కొనసాగింపు అన్నవి అమెరికా నిర్ణయానుసారం జరిగిపోవాలని,ఆ విధంగా భారత్ కూడా కోలుకోనంత నష్టాలను చవి చూడాలని ఆ దేశ ప్రధాని జో బైడెన్ భావిస్తున్నారని సంబంధిత వ్యాఖ్యల ద్వారా నిర్థారణ అవుతోంది.
భారత్ మాత్రం యుద్ధ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.వీలున్నంత వరకూ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆపే విషయమై పెద్దగా చొరవ అయితే తీసుకోలేదు కానీ ఉక్రెయిన్ కు కొంత సాయం అయితే చేసింది. మందులు,ఆహారం పంపిణీ చేసింది. అయితే యుద్ధం ఆపే పని చేయక పోయిన దేశీయ వాణిజ్య వ్యవహారాలు విదేశీ పొత్తులు వంటి విషయాలపై మరి కొంత క్లారిటీని పెంచుకుంది. రష్యాతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు ఏవీ మారబోవని, చమురు నిక్షేపాల కొనుగోలు పై కూడా కొంతలో కొంత క్లారిఫికేషన్ ఇచ్చింది. చౌక ధరకు ఎవరు పెట్రో ఉత్పత్తులు అమ్ముతారో వారికే తమ తొలి ప్రాధాన్యం అని తేల్చేసింది.ఇదే సమయంలో పాక్ కొన్ని వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయినా కూడా మోడీ మాత్రం కొంతలో కొంత హుందాగానే ఉన్నారు.
అటు రష్యాకు మద్దతివ్వలేదు. ఇటు ఉక్రెయిన్ చర్యలనూ సమర్థించలేదు. కానీ ఉక్రెయిన్ నుంచి మన దేశ విద్యార్థులను తీసుకు రావడంలో మాత్రం కాస్త తడబడ్డారు.ఈ సమయంలో ఆపరేషన్ గంగ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం కాస్త విమర్శల్లో ఇరుక్కుంది. దీనిని కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సునాయాసంగా వాడుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణ ఒకటి మోడీ కి సంబంధించి స్పష్టంగా వినిపించింది.
ఇది మినహా యుద్ధ వివరాల్లో ఏ దేశం వైపు వెళ్లాలి అన్నది తేల్చుకోలేదు అలా అని కవ్వింపు ధోరణిలోనో, రెచ్చగొట్టే పద్ధతిలోనో మాట్లాడకుండా మోడీ ఎంతో హుందాగానే ఉన్నారు.అదేవిధంగా ఇక్కడికి చేరుకున్న వైద్య విద్యార్థుల చదువు విషయమై కూడా ఇప్పుడిప్పుడే ఓ క్లారిఫికేషన్ వస్తుంది కనుక వీరిపై కూడా మానవతను చూపాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇప్పటికే తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వీరి చదువుల విషయమై అండగా ఉంటామనే చెప్పాయి. కేంద్రం కూడా మరికొంత సాయం అందిస్తే వైద్య విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపశమనం దక్కిందనే భావించాలి. అదేవిధంగా యుద్ధం నేపథ్యంలో ధరల పెరుగుదలపై కొన్ని వదంతులు వచ్చినా అవి కూడా నెగ్గుకు రాలేదు. వంట నూనెల ధరలు పెరిగినా కూడా అవేమంత ఆందోళనకర రీతిలో అయితే లేవు. ఇక కొన్ని సందర్భాల్లో అమెరికా కొంత రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం భారత్ యుద్ధం విషయమై అస్థిర తత్వంతో ఉందని చెప్పడం వంటి అనుచిత రీతిలో ఉన్ను మాటలలను విని వదిలేశారు మోడీ.ఆ విధంగా భారత్ మౌనం కొత్త శత్రువుల సృష్టిని అడ్డుకుంది. మేలు చేసింది కూడా!