Begin typing your search above and press return to search.
రష్యాకు వ్యతిరేకంగా గ్రామాన్ని ముంచేసిన ఉక్రెయిన్ గ్రామస్థులు..
By: Tupaki Desk | 30 April 2022 12:30 AM GMTప్రపంచంలోనే అగ్రదేశం రష్యా తన సరిహద్దును ఆనుకొని ఉన్న ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి రెండు నెలలు కావస్తోంది.ఇప్పటికీ రష్యా యుద్దాన్ని పూర్తి చేయలేదు. మొత్తం దేశాన్ని టేకోవర్ చేయడం లేదు. ఉక్రెయిన్ సైన్యం, ప్రజలు, యువత స్వచ్ఛందంగా వచ్చి యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపిస్తున్నారు. తమ పరిధిలో ఉన్న వనరులతోనే రష్యాను అడ్డుకుంటున్నారు.
గత నెలలో ఉక్రెయిన్ లో వచ్చిన వరదల కారణంగా పలు ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను వెనక్కి రప్పించుకుంది. రష్యా వెనకడుగు వేయడంలో వరదలు కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే రష్యా సైనికుల రాకను గమనించిన ఉక్రెయిన్ లోని దెమిదివ్ గ్రామస్థులు సాహసం చేశారు. ఏకంగా పక్కనున్న నది నుంచి నీరును గ్రామంలోకి పారించి తమకు తాము ముంచేసుకున్నారు.
ధైర్యం అనేది ఉక్రెయిన్ ప్రజల డీఎన్ఏలోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారి మిఖాయిల్ ఫెడోరోవ్ ట్వీట్ చేశారు. ఊరిని వరదలతో ముంచేసిన ఫొటోలను ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం వల్ల రాజధాని కీవ్ లో బలగాలు డిఫెన్సివ్ చర్యలను చేపట్టేందుకు అవకాశం దొరికినట్టైందన్నారు. సాధారణ పౌరులు కూడా ఉక్రెయిన్ లో హీరోల్లా మారి విజయం కోసం పోరాడుతున్నారని కామెంట్ చేశారు.
రష్యా సైనికులను అడ్డుకోవడానికి ఏకంగా పక్కనున్న నది నీటిని మళ్లించి ఓ గ్రామాన్ని నీటితో నింపేశారు. గ్రామాన్ని వరదలతో ముంచేస్తే రష్యా యుద్ధ ట్యాంకులు ఊరిలోకి రాలేవని.. తద్వారా తమను తాము రక్షించుకోవచ్చని గ్రామస్థులు ఈ ప్లాన్ చేశారు. రష్యా సైనికుల చేతికి చిక్కబోమని.. వరదల్లోనే ఉంటామని ఆ గ్రామస్థులు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పొరుగున పారే నదుల్లో మోటార్లు వేసి నీటిని తోడి గ్రామాల్లోకి మళ్లిస్తున్నారు. రాజధాని కీవ్ కు సమీపంలోని దెమిదివ్ గ్రామంలో ఇది చోటుచేసుకుంది. రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లలేకుండా ఊరు మొత్తాన్ని గ్రామస్థులు వరద నీటితో ముంచేశారు.