Begin typing your search above and press return to search.
వణికిపోతున్న ఉక్రెయిన్
By: Tupaki Desk | 19 Feb 2022 8:30 AM GMTరష్యా దెబ్బకు ఉక్రెయిన్ దేశం వణికిపోతోంది. తాజాగా రష్యా, బెలారస్ సరిహద్దుల్లోకి రష్యా తన ఆయుధాలను మోహరించింది. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, రాకెట్ లాంచర్లతో పాటు భారీ సంఖ్యలో సైన్యాన్ని కూడా మోహరించింది. బెలారస్ వైపు నుండి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కేవలం 80 మైళ్ళ దూరంలోనే ఉంది. అంటే బెలారస్ వైపు నుంచి రష్యా క్షిపణులను ప్రయోగించినా నిముషాల వ్యవధిలోనే కీవ్ లో చాలావరకు ధ్వంసం అయిపోవటం ఖాయం.
ఈ కారణంగానే ఉక్రెయిన్ వణికిపోతోంది. ఒకవైపు నాటో దళాలతో రష్యా చర్చలంటోంది. మరోవైపు ఉక్రెయిన్ చుట్టూ తన సైన్యాన్ని మోహరిస్తోంది. ఏ క్షణమైనా దాడులు జరగవచ్చనే పరోక్ష సంకేతాలు పంపుతోంది. ఒకవేళ రష్యా నిజంగానే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగితే యూరోపులోని చాలా దేశాలకు వెంటనే గ్యాస్ సమస్య మొదలైపోతుంది. ఎందుకంటే యూరోపులోని జర్మనీ, పోలండ్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి చాలాదేశాలకు రష్యా నుండే గ్యాస్ అందుతోంది.
యుద్ధమే గనుక మొదలైతే ముందు రష్యా గ్యాస్ ఉత్పత్తిని, సరఫరాను నిలిపేస్తుంది. దాంతో గ్యాస్ దొరక్క చాలా దేశాలు అల్లాడిపోతాయి. అందుకని ఉక్రెయిన్ మీద ప్రేమ కాకపోయినా తమ సమస్యలను దృష్టిలో ఉంచుకునే యుద్ధం వద్దని చాలా దేశాలు రష్యాపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. యూరోపు దేశాలతో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు యుద్ధ సన్నాహాలను చేసుకుపోతోంది రష్యా. దాంతో రష్యా మనసులో ఏముందో అర్థం కాక బ్రిటన్, అమెరికా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి.
గ్యాస్ ఉత్పత్తి, సరఫరా వల్ల జరిగే నష్టాలను తట్టుకోవటానికి తమ దేశం సిద్ధంగా ఉందంటు రష్యా విదేశాంగ మంత్రి ఇచ్చిన ప్రకటనతో చాలా దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. అనుకున్నది సాధించే క్రమంలో వేలాదిమంది చనిపోయిన పర్వాలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచిస్తున్నట్లు బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ కు మూడువైపులా రష్యా సైన్యం మోహరింపు, కదలికలు శాటిలైట్ ఫోటోలు వీడియోల్లో స్పష్టంగా కనబడుతోంది. దీంతో ఏ క్షణం ఏమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.