Begin typing your search above and press return to search.
బాబును ఉమాభారతి ఎంతగా పొగిడేశారంటే..
By: Tupaki Desk | 25 Sep 2015 4:26 AM GMTపోయిన పరపతిని తిరిగి తెచ్చుకోవటం ఎలా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను సరికొత్తగా ఆవిష్కరించుకోవటం ఎలా? లాంటి సవాళ్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర చాలానే సమాధానాలు ఉంటాయి. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. తనకు తాను సీఈవోగా చెప్పుకునే దమ్ము.. ధైర్యం చంద్రబాబుకే. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం నప్పుతుందో బాగా తెలిసిన చంద్రబాబుకు.. విపక్షంలో ఉన్నప్పుడు.. విభజన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని ఆయన అంత త్వరగా మర్చిపోతారనుకోలేం.
తనకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో కొందరు రాజకీయ మిత్రులు అనుసరించిన వైనాన్ని బాబు అప్పుడప్పడు గుర్తు తెచ్చుకుంటారు. తన చేతికి కానీ అధికారం రావాలే కానీ.. అంటూ పదేళ్లుగా ఆయన చెబుతున్న మాటలకు ఫలితం లభించిన వేళ ఆయన వెనక్కి తగ్గుతారనుకుంటే తప్పులో కాలేసినట్లే. విభజనతో కునారిల్లిన ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ పట్టాల మీదకు ఎక్కించటంతో పాటు.. ఏపీలో ఏదో జరుగుతుందన్న భావన కలిగించటంలో బాబు మరోసారి విజయవంతం అయ్యారు.
సాగునీటి ప్రాజెక్టు అంటే ఏళ్లకు ఏళ్లు సాగే తీరుకు భిన్నంగా.. రికార్డు సమయంలో పూర్తి చేయటం.. నదుల అనుసంధానం చేస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్ ను పట్టిసీమ ప్రాజెక్టుతో చేతల్లో చూపించిన చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా లభించాల్సిన మైలేజీ లభించినట్లే.
తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి పొగిడిన పొగడ్తలే దీనికి నిదర్శనం. అసాధ్యమైనవి.. చాలా శ్రమతో కూడుకున్నవని భావించే విషయాల్ని సింఫుల్ గా తేల్చేసే చంద్రబాబు లాంటి నేతకు కితాబులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి పెద్దగా వెనుకాడలేదు. నదుల అనుసంధానం విషయంలో ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టుగా పట్టిసీమను ఆమె అభివర్ణించటమే కాదు.. దాన్ని పూర్తి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెగ పొగిడేశారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి నదుల అనుసంధానం సాధించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించటమే కాదు.. పట్టిసీమతో నదుల అనుసంధానం చేయటం ఒక ప్రపంచ రికార్డుగా అభివర్ణించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్న అభయాన్ని ఇచ్చేశారు. మొత్తంగా చూస్తే.. పట్టిసీమ ప్రాజెక్టుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులే కాదు.. పరపతి కూడా బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం రికార్డు సమయంలో ఒక ప్రాజెక్టు పనులు పూర్తి చేయటం అంత చిన్న విషయం కాదు కదా.