Begin typing your search above and press return to search.
మాధవరెడ్డిపై కేసీఆర్ కామెంట్ అదిరిందే!
By: Tupaki Desk | 14 Dec 2017 1:30 PM GMTటీ టీడీపీలోనే కాకుండా మొత్తంగా టీడీపీని తొలి నాళ్ల నుంచి చూస్తే... దివంగత నేత - ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి పార్టీలో నెంబర్ టూ స్థానానికి ఎగబాకిన నేతగా పేరు గడించారు. ఎన్టీఆర్ హయాం నుంచే పార్టీలో కొనసాగిన మాధవరెడ్డి... పార్టీలో అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా... తన సొంత జిల్లా నల్లగొండలో తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారంటే అతిశయోక్తి కాదేమో. ఆ కారణంగా నక్సల్స్ దాడిలో ఆయన మరణించి చాలా కాలమే అయినా... ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి కుటుంబానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు.
మాధవరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో తెరగేంట్రం చేసిన ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డికి కూడా పార్టీలో మంచి ప్రాధాన్యమే దక్కింది. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఆమె మంత్రిగానే ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉమా చాలా క్రియాశీలంగానే వ్యవహరించారు. గొంతులో ప్రాణమున్నంత వరకూ టీడీపీని వీడేది లేదని ఇటీవలే ప్రకటించిన ఉమా... మారిన రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తలను కాపాడుకోవాలంటే పార్టీ మారక తప్పడం లేదన్న మాటను వినిపించి... కాసేపటి క్రితం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఉమా మాధవరెడ్డితో పాటు ఆమె పుత్రరత్నం సందీప్ రెడ్డి కూడా టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో గులాబీ గూటిలోకి చేరిపోయారు. హైదరాబాదులోని టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేసీఆర్... చాలా ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. దివంగత నేత మాధవరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని - ఆయన మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని ప్రశంసించారు. ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని - తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదని వెల్లడించారు. ఉమామాధవరెడ్డి టీఆర్ ఎస్ పార్టీలోకి రావడం సొంత చెల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబం తనకు ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. `1985లో నేను - మాదవరెడ్డి ఒకటేసారి ఎమ్మెల్యేలం అయ్యాం. తెలంగాణకు సరిగ్గా నిధులు రాకపోతే నేను - మాధవరెడ్డి కలిసి వెళ్లి ముఖ్యమంత్రితో నిధుల కోసం కొట్లాడేవాళ్లం. చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచినపుడు నాతోపాటు మాధవరెడ్డి చంద్రబాబును వ్యతిరేకించారు.` అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఎలిమినేటి మాధవరెడ్డి నా ఆత్మీయ మిత్రులని కేసీఆర్ ఆ నాటి ఉదంతాన్ని గుర్తు చేశారు. ` రాజకీయాలు సర్వసాధారణం. ఒకసారి ఓడిపోతాం - ఒకసారి గెలుస్తాం. కొత్త రాష్ట్రం ఆరునూరైనా బాగుపడాలి. ఏ అంశాల్లో గోసపడ్డామో - ఆ సమస్యలు పరిష్కారం కావాలి. నల్గొండ నుంచి చాలా మంది మంత్రులయ్యారు. నల్గొండ జిల్లా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి. ఉమామాధవరెడ్డి - సందీప్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉంటుంది. సందీప్ రెడ్డికి మంచి అవగాహన శక్తి ఉంది. రాజకీయాల్లో ఎవరికి - ఎపుడు - ఏ అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు` అని సీఎం కేసీఆర్ అన్నారు.
అంతా బాగానే ఉన్నా... కేసీఆర్ స్పీచ్ విన్న తర్వాత రాజకీయ విశ్లేషకులు కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆర్నెళ్లుగా టీఆర్ ఎస్ లో చేరేందుకు ఎలిమినేటి ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటూ ఉండగా, విడతల వారీగా చర్చలు జరిగాయన్న వార్తలు వినిపించాయి. అసలు తమకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని వదిలేసి వస్తే... టీఆర్ ఎస్ లో తమకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కుతుందోనన్న అనుమానం కూడా వారిని వెంటాడింది. ఈ కారణంగా ఆరు నెలల పాటు వారు ఆగారన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు పార్టీ చేరేందుకు ఉమా మాధవరెడ్డి ఏ ఒక్క డిమాండ్ ను తమ ముందు పెట్టలేదని కేసీఆర్ చెప్పడంలో అర్థమేమిటన్న విశ్లేషణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అయినా ఈ విషయం తేలడానికి ఎక్కువ సమయం ఆగాల్సిన అవసరం లేదులెండి. ఎందుకంటే ఇంకో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కదా. ఆ ఎన్నికల్లో ఎలిమినేటి ఫ్యామిలీ ఏం డిమాండ్ చేసిందో ఇట్టే తెలిసిపోతుంది కదా. అప్పటిదాకా కేసీఆర్ చెప్పిన మాటను నమ్మి తీరాల్సిందే.