Begin typing your search above and press return to search.
రైతుల జీవితం అంటే ఆషామాషీ అయిపోయిందా?
By: Tupaki Desk | 4 May 2017 2:00 PM GMTఏపీలో మిర్చీ రైతుల అవస్తలు - కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యాపార సంస్థల్లో జరుగుతున్న తంతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ స్టోర్ లో 200 గ్రాముల మిర్చికి రూ.44 వసూలు చేస్తున్నారని, ఆ లెక్కన క్వింటాల్ ధర రూ.22వేలు అవుతుందన్నారు. అదే రైతుకు ఇస్తున్నది రూ.4వేలు అని, హెరిటేజ్ లో అమ్ముతున్నది రూ.22వేలా? అని సూటిగా ప్రశ్నించారు. ఇక రిలయన్స్ దుకాణాల్లో 200 గ్రాముల మిర్చి రూ.71 ...దాని ప్రకారం క్వింటాల్ ధర రూ.35వేలు అవుతుందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందులో రెండు నుంచి మూడో వంతు కూడా రైతులకు దక్కడం లేదని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు మార్కెట్ యార్డు సందర్శించిన ఐదు వారాల తరువాత ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో మే 1 - 2 తేదీల్లో రైతు దీక్ష చేశారని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. రూ. 15 వందలు మిర్చి రైతులకు బోనస్ ఇస్తామని కండీషన్స్ పెట్టి వారిని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ పండించిన పంటైనా గుంటూరు మార్కెట్ యార్డుకు తీసుకొస్తేనే బోనస్ ఇస్తామనే నిబంధన ప్రభుత్వం పెట్టిందన్నారు. మిర్చి పంట ఎప్పుడు మార్కెట్ యార్డుకు వస్తుందో కనీస అవగాహన కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేదన్నారు. దేశంలోనే అతిపెద్దైన గుంటూరు మార్కెట్ యార్డులో ఓ విధానం అంటూ లేకుండా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు.రైతులు ఎంత పంట పండించినా 20 క్వింటాలే కొంటామనడం ప్రభుత్వానికి తగదన్నారు. గత సంవత్సరం సగటు రేటు 11 నుంచి 12వేలు అమ్మిన నేపథ్యంలో ఈ ఏడాది దారుణంగా ధరలు పడిపోయాయన్నారు.
వైఎస్ జగన్ మార్కెట్ యార్డును సందర్శించిన సమయంలో నాణ్యమైన సరుకు రూ. 7వేలుందని, మార్కెట్ రోజురోజుకు తగ్గిపోతూ మూడువేలకు వచ్చిందని, ప్రస్తుతం రూ.1500కు పడిపోయిందని ఉమ్మారెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వం రూ.5వేలు ఇస్తుందన్న తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు గుంటూరు మార్కెట్ యార్డుకు పంటలు తీసుకొచ్చారన్నారు. రూ. 10లక్షల క్వింటాలు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయని, మార్కెట్ యార్డులోఖాళీ లేక రోడ్లపై, చేలల్లో స్టోర్ చేసుకున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇంత అస్తవ్యస్థ దారుణం మరెక్కడా ఉండదన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో గుంటూరు మార్కెట్ యార్డులో విపరీతమైన అలజడి వచ్చిందని అన్నారు. మిర్చిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలు జరగడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం అనేక షరతులు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ధరపై స్పష్టత లేదని మార్కెటింగ్ కమిషనర్ చెబుతున్నారని, ఒకవేళ పంట కొనుగోళ్లు చేసినా స్టోరేజీ చేయడానికి గోడౌన్లు ఖాళీ లేవని చెబుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువైందని ఆయన అన్నారు. రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా అని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రోజుకు 34మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి, అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఉమ్మారెడ్డి అన్నారు. మిర్చి క్వింటాల్ కు రూ.10వేలు చొప్పున కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/