Begin typing your search above and press return to search.
జగన్ 8 ప్రశ్నల పరువు తీసిన వైకాపా నేత!
By: Tupaki Desk | 18 Oct 2015 5:06 AM GMTవైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం రాకపోవడం అనేది ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. కానీ జగన్ చాలా తెలివిగా దానిని 'పబ్లిక్ ఇష్యూ'గా మార్చేశారు. అసలు అమరావతి నగర నిర్మాణమే ఒక ప్రజాద్రోహం అని ఎస్టాబ్లిష్ చేసే రీతిలో.. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 8 ప్రశ్నలతో ఒక లేఖ రాశారు. అమరావతి నిర్మాణంలో ఎన్నెన్ని అరాచకాలు జరుగుతున్నాయో.. ఎంత ఘోరాలు జరుగుతున్నాయో అందులో జగన్ వివరించారు. ఇన్ని ఘోరాలకు తాను కూడా ఒక సాక్షిగా ఉండడం ఇష్టం లేకుండా.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాబోవడం లేదని.. జగన్ లేఖలో రాసేశారు. జగన్ రాసిన లేఖలోని 8 ప్రశ్నలు, అవి సూటిగా సంధించిన తీరు చూసి.. జగన్ అభిమానులంతా మురిసిపోయారు కూడా! అబ్బో మన నాయకుడు చంద్రబాబు పరువు తీసేస్తున్నాడుగా అని పండగ చేసుకున్నారు.
కానీ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జగన్ కు సంబంధించిన వ్యూహకర్తల్లో ఒకరుగా.. పేరున్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాస్త భిన్నంగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన విషయాలు, చెప్పిన కారణాలు వింటే జగన్ అంటే ప్రజలకు చాలా చులకన భావం ఏర్పడేలా ఉంది. జగన్ పరువు తీసేసేలా.. ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు.
నిజానికి పాపం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టారు గానీ.. ఆయన చెప్పిన విషయాలను గమనిస్తే మాత్రం జగన్ పరువు పోయేలా ఉన్నదని పార్టీలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటిదాకా జనం మొత్తం .. ఆయన రాసిన లేఖలోని 8 ప్రశ్నల వల్లనే.. ఆ కారణాల వల్లనే శంకుస్థాపనకు వెళ్లడంలేదని అనుకుంటున్నారు. అయితే ఉమ్మారెడ్డి మాత్రం.. చంద్రబాబు ఇదివరలో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ ను ఆహ్వానిస్తున్నారా? అని మీడియా అడిగితే.. ప్రతిపక్ష నేతనుంచి సామాన్య ప్రజల వరకు అందరినీ ఆహ్వానిస్తున్నాం అని చెప్పారని.. ప్రతిపక్ష నేత గా జగన్ విలువను ఆయన గుర్తించలేదని... ఇది చాలా అవమానకరం అని సెలవిచ్చారు.
అంటే తనను సామాన్య జనంతో కంపేర్ చేసిచెప్తారా అని అలిగి, ఉడుకుమోతుతనంతో జగన్ ఎగ్గొడుతున్నట్లుగా అర్థమవుతోంది తప్ప.. ఆయన రాసినలేఖలోని 8 ప్రశ్నలు కుంటిసాకులు మాత్రమే అని అర్థమవుతోంది. జగన్ ఇలాంటివి సహించలేరని.. అందుకే ప్రశ్నల్ని అడ్డుపెట్టుకున్నారని జనం అనుకుంటున్నారు. మొత్తానికి సొంత పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కీలకమైన విషయాన్ని బయటపెట్టడం ద్వారా.. తమ జగన్ పరువు తీసేశారని అంతా అనుకుంటున్నారు.