Begin typing your search above and press return to search.
ఐపీఎల్ః బౌలర్ నేలబారు యవ్వారం.. అంపైర్ వార్నింగ్!
By: Tupaki Desk | 13 April 2021 5:34 AM GMTగెలుపు ముఖ్యం. కానీ.. దానికోసం నిబంధనలను అతిక్రమిస్తామంటే కుదరదు. మైదానంలో హెచ్చరికలు ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా.. బయట విమర్శలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది తెలిసి కూడా అఫఖ్యాతి మూటగట్టుకునే పనులు ఎందుకు చేస్తారో తెలియదు కొందరు ఆటగాళ్లు!
బౌలింగ్ చేస్తున్నప్పుడు చేయి ఎన్ని డిగ్రీల మేర వంచాలనేదానికి రూల్స్ ఉన్నాయి. అంతకు మించి కిందకు దించితే ‘అండర్ ఆర్మ్’గా పరిగణిస్తారు. అంటే.. నేలబారు యవ్వారం అన్నమాట. గ్రౌండ్ కు సమాంతరంగా బౌలింగ్ చేయడం నిషేధం. అయినప్పటికీ.. ఈ మధ్య కొందరు తరచుగా ఈ బౌలింగ్ చేస్తూ విమర్శలపాలవుతున్నారు.
మొన్న రవిచంద్రన్ అశ్విన్, నిన్న కేదార్ జాదవ్, ఇవాళ రియాన్ పరాగ్. నిన్న రాజస్తాన్ రాయల్స్-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్తాన్ స్పిన్నర్ రియాన్ పరాగ్.. గేల్ కు బౌలింగ్ చేస్తున్న సమయంలో దాదాపు అండర్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు.
చేతిని మరీ కిందకు వంచి త్రో చేసినట్టుగా విసిరేశాడు. దీంతో.. అంపైర్ వెంటనే స్పందించారు. ఇలాంటి బౌలింగ్ సరికాదని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో.. ఆ తర్వాత బంతి నుంచి మామూలుగా బౌల్ చేశాడు పరాగ్. ఇలా.. రూల్స్ అతిక్రమించడం ఎందుకు? హెచ్చరికలు, విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు?