Begin typing your search above and press return to search.

బీజేపీకి మేలు చేసిన ఐక్యరాజ్యసమితి నిర్ణయం!

By:  Tupaki Desk   |   2 May 2019 4:36 AM GMT
బీజేపీకి మేలు చేసిన ఐక్యరాజ్యసమితి నిర్ణయం!
X
పాకిస్తాన్ ఉగ్రవాది - జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది ఐక్యరాజ్యసమితి. ఈ అంశంలో భారత్ చాలా సంవత్సరాలుగా ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అజహర్ ను చైనా వెనకేసుకు వచ్చింది. ఐక్యరాజ్యసమితిలో తన పవర్ ను ఉపయోగించుకుని మసూద్ అజర్ పై చైనా అంతర్జాతీయ ఉగ్రవాది ముద్రను పడనీయకుండా చూసింది.

అయితే ఈ విషయంలో భారత్ వెనక్కు తగ్గలేదు. అనేక రకాలుగా ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఇటీవల పుల్వామా అటాక్ అనంతరం భారత్ ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. ఆ దాడి సూత్రధారి కూడా అజహర్ అని
భారత్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చింది. ఈ సారి చైనా కూడా గట్టిగా అడ్డుకోలేకపోయింది. దీంతో అజహర్ మీద అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడింది.

ఇది భారత్ కు సానుకూలాంశం. అజహర్ కు ఇక పాక్ సహకారం అందించడం కూడా అంత తేలిక కాదు. ఆధారాలు చూపించగలిగితే అటు ఆ ఉగ్రవాదిని - ఇటు పాక్ ను భారత్ ఇరకాటంలో పెట్టగలదు.

మొత్తానికి ఉగ్రవాదంపై పోరులో భారత్ ఒకింత విజయాన్నే సాధించింది. ఇది ఎన్నికల వేళ జరగడం విశేషం. అజహర్ మీద అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడటం తమ ప్రభుత్వ విజయం అని మోడీ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఆ వ్యాఖ్య చేశారు.

ఇలాంటి విషయాలను ఎన్నికల వేళ చెప్పుకోవడం మంచిదా - కాదా అనే విషయాన్ని పక్కనపెడితే ఈ విషయాన్ని వదులుకోవడం మాత్రం లేదు నరేంద్రమోడీ. ఆయన ప్రచారం చేసుకున్నా - చేసుకోకపోయినా.. ఈ పరిణామం భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో కొంత సానుకూలంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు కూడా అంటున్నారు.