Begin typing your search above and press return to search.

నిలబడలేక.. వణుకుతూ.. పుతిన్ ఆరోగ్యంపై వీడియో వైరల్

By:  Tupaki Desk   |   16 Jun 2022 7:31 AM GMT
నిలబడలేక.. వణుకుతూ.. పుతిన్ ఆరోగ్యంపై వీడియో వైరల్
X
ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ‘పుతిన్’. ఇప్పుడీ ఆధునిక నియంత తన పొరుగు దేశం ‘ఉక్రెయిన్’పై యుద్ధానికి దిగడంతో వైరల్ అయ్యారు. మన మోడీ చాయ్ వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు. కానీ రష్యా ఒకప్పడి ప్రధాని, ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఓ వంట చేసే వ్యక్తి మనవడు అంటే నమ్ముతారా?కానీ ఇది నిజం. ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ పుట్టారు? పుతిన్ గూఢాచారి నుంచి దేశ అధ్యక్షుడి వరకూ ఎలా ఎదిగాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రష్యాకు జీవిత కాల అధ్యక్షుడిగా మారిన పుతిన్ 1952 అక్టోబర్ 7న జన్మించారు. రష్యా గూఢచారిగా యూరప్ సహా పలు దేశాల్లో రహస్యంగా గడిపారు. అనంతరం సైన్యంలో కీలక పదవి అధిరోహించి రాజకీయంగా బలపడ్డారు. 2012 మే 7న రష్యా అధ్యక్షుడయ్యారు. 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా కొనసాగిన పుతిన్.. ఆ తరువాత 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. వాస్తవానికి రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా రెండు పర్యాయాల కంటే ఎక్కువగా కొనసాగడానికి వీళ్లేదు. కానీ 2008లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటికీ ప్రధానమంత్రిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఆ తరువాత తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు జాగ్రత్తపడ్డాడు. ఈ సమయంలో నాలుగేళ్ల అధ్యక్షపదవి నుంచి ఆరేళ్లకు పెంచారు. అయితే 2021లో జరిగిన రాజకీయ పరిణాలతో పుతిన్ మరోసారి అధ్యక్షుడై జీవితకాలం ఉంటానని ప్రకటించుకున్నాడు.

ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది. ఆయన తాజా వీడియో చూసిన వారికి ఈ అనుమానం కలుగకమానదు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తుండడంతో పుతిన్ కు ఏమైందని తెలుసుకోవాలనుకుంటున్నారు. పుతిన్ ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

వ్లాదిమర్ పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని.. రక్త క్యాన్సర్ తో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని గత నెలలో వార్తలు వచ్చాయి. తాజాగా క్రెమ్లిన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. నిలబడలేక ఇబ్బందిపడుతున్నట్లు, వణుకుతున్నట్టు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యాకు చెందిన ఒక సంపన్న వ్యక్తి పుతిన్ సీరియస్ గా ఉన్నాడని తెలిపారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు మేజర్ శస్త్రచికిత్స చేశారని తెలుపడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది.. ఉక్రెయిన్ యుద్ధానికి ముందే ఈ ఆపరేషన్ జరిగిందట.. అయినా ఇప్పటీకీ పుతిన్ కోలుకోవడం లేదని.. ఆయన బతకడం కష్టమేనని అంటున్నారు. పుతిన్ కు రహస్యంగా వైద్యం అందిస్తున్నట్టుగా సమాచారం. దీంతో పుతిన్ పరిస్థితి విషమంగానే ఉందన్నవార్తలు వస్తున్నాయి.

పుతిన్ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని గతంలో గతంలో బ్రిటీష్ గూఢచారి సైతం అన్నారు. వైద్యం కోసం తరుచుగా సమావేశాలకు రాకపోవడం.. వచ్చినా మధ్యలో విరామం తీసుకోవడం వంటివి చేస్తారని చెప్పారు. పుతిన్ ఆరోగ్యం గురించి ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. కానీ ఎంతవరకూ ఆయన ఆరోగ్యం క్షీణించింది అనే విషయాలు తెలియరాలేదు.