Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి మాట‌!... మోదీ స‌ర్కారు నీటి బుడ‌గే!

By:  Tupaki Desk   |   9 Feb 2018 6:42 AM GMT
ఉండ‌వ‌ల్లి మాట‌!... మోదీ స‌ర్కారు నీటి బుడ‌గే!
X
మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌ లో ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రిగిన తీరుతో ర‌సవ‌త్త‌రంగా మారిన రాజకీయంలో మోదీ స‌ర్కారు దాదాపుగా ప‌డిపోయే స్థితిలోనే ఉంద‌న్న మాట వినిపిస్తోంది. గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మిలోని ఇత‌ర పార్టీల‌తో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మేర సీట్లు బీజేపీకి ద‌క్కాయి. అయితే మిత్ర‌ధర్మాన్ని పాటించిన న‌రేంద్ర మోదీ... బీజేపీ ప్ర‌భుత్వాన్ని కాకుండా ఎన్డీఏ స‌ర్కారును ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో త‌న కేబినెట్‌ లో బీజేపీ మంత్రుల‌తో పాటుగా ఎన్డీఏలో భాగ‌స్వాములుగా ఉన్న పెద్ద పార్టీల‌తో పాటు చిన్న పార్టీల‌కు కూడా మోదీ స్థానం క‌ల్పించారు. అయితే త‌న‌కు ద‌క్కిన బ‌లాన్ని చూసుకున్న మోదీ కాల‌క్ర‌మంలో చాలా మారిపోయార‌న్న మాట లేక‌పోలేదు. ఎన్డీఏ భాగస్వామ్య ప‌క్షాల్లోని ఏ ఒక్క పార్టీ అభిప్రాయం తీసుకోకుండానే కేంద్రంలో చాలా కీల‌క నిర్ణ‌యాల‌కు సంబంధించిన చ‌ర్య‌ల‌ను మోదీ చేప‌ట్ట‌డ‌మే ఇందుకు నిదర్శ‌నంగా చెప్పుకోవాలి.

ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వాములుగా ఉన్న పార్టీల్లో మ‌హారాష్ట్ర‌కు చెందిన శివ‌సేన‌తో పాటుగా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. ఎందుకంటే... ఎన్డీఏలోని అన్నాడీఎంకే పార్టీని ప‌క్క‌న‌బెడితే... ఆ మ‌రుస‌టి స్థానాల్లో నిలిచే పార్టీలు ఈ రెండే. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ బిల్లు విష‌యాల్లో ఈ రెండు పార్టీల‌ను ఏమాత్రం సంప్రదించ‌కుండానే మోదీ ఆ రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంతేకాకుండా త‌న కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా శివ‌సేన‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌ని మోదీ... శివ‌సేన నేత‌గా ఉన్న సురేశ్ ప్ర‌భును ఆ పార్టీ క‌న్‌ సెంట్‌ తో ప‌నిలేకుండా త‌న మంత్రివ‌ర్గంలో చేర్చుకున్నారు. ఈ ప‌రిణామంతో శివసేన ఎన్డీఏకు దూరంగా జ‌రుగుతుంద‌ని అంతా భావించినా.. ఆ ప‌రిణామం చోటుచేసుకోలేదు. అయితే జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కూలంక‌షంగానే ప‌రిశీలిస్తూ వ‌చ్చిన శివ‌సేన‌... ఇక బీజేపీతో క‌లిసి కొన‌సాగితే త‌న‌కు నష్ట‌మేన‌న్న విష‌యాన్ని గుర్తించి ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొల‌గింది. ఇక‌పై ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా... బీజేపీతో సంబందం లేకుండానే తాను మాత్ర‌మే ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతాన‌ని శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే... ఇటీవ‌ల రాజ‌స్థాన్‌ లో రెండు లోక్ స‌భ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న సిట్టింగ్ స్థానాల‌ను కూడా కోల్పోయింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయి మెజారిటీగా 295 స్థానాల‌ను ద‌క్కించుకున్న బీజేపీ... ఈ రెండు స్థానాల‌ను కోల్పోయిన నేప‌థ్యంలో ఆ పార్టీ సంఖ్యాబ‌లం లోక్ స‌భ‌లో 293కు ప‌డిపోయింది. అయితే ఈ సంఖ్య‌తోనే ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో సంబంధం లేకుండానే ప్ర‌భుత్వాన్ని నెట్టుకొచ్చే అవ‌కాశాలున్నా.. పార్టీలో రెబెల్స్‌ గా మారిన వారి ప్ర‌భావంతో సీట్ల సంఖ్య మ‌రింత‌గా త‌గ్గిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో తెలుగు నేల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ నేటి ఉదయం ఓ టీవీ చానెల్ నిర్వ‌హించిన లైవ్ డీబేట్‌ లో పాల్గొన్న సంద‌ర్భంగా ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. రెబెల్స్‌ తొ పాటుగా శివ‌సేన మాదిరే టీడీపీ కూడా మోదీ స‌ర్కారుకు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తే... ఇప్ప‌టికిప్పుడు ఎన్డీఏ స‌ర్కారు కూల‌డం ఖాయ‌మ‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉండ‌వ‌ల్లి లెక్క ప్ర‌కారం ఇప్ప‌టికీ మోదీ స‌ర్కారుకు లోక్ స‌భ‌లో మెజారిటీ ఉన్నా... శివ‌సేన మాదిరిగా ఏపీకి న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీ కూడా బీజేపీకి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తే... బీజేపీ టికెట్ల మీద గెలిచిన చాలా మంది ఎంపీలు త‌మ భవిష్య‌త్ అవ‌స‌రాల‌ను దృప్టిలో పెట్టుకుని బీజేపీకి వీడ్కోలు ప‌ల‌క‌డం ఖాయ‌మేన‌ట‌. మొత్తంగా ఉండ‌వల్లి అంచ‌నా ప్ర‌కారం... ఏపీకి కేంద్రంలోని మోదీ స‌ర్కారు అన్యాయం చేసింద‌ని పార్ల‌మెంటు వేదిక‌గా ఉద్య‌మానికి తెర తీసిన టీడ‌పీ... ఇప్ప‌టికిప్పుడు ఎన్టీఏ స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే.. మోదీ స‌ర్కారు ఉన్న‌ప‌ళంగా కూలిపోవ‌డం ఖాయ‌మేన‌ట‌. అయితే ఇది జ‌ర‌గాలంటే చంద్రబాబుకు ధైర్యం ఉండాల‌ని - నాడు ఎన్టీఆర్ చేతిలో నుంచి అధికార ప‌గ్గాల‌ను లాగేసుకున్న‌ప్పుడు చూపించిన తెగువ‌లో చంద్ర‌బాబు. ఓ ప‌దో వంతు చూపినా ఫ‌లితం ఉంటుంద‌ని, మోదీ స‌ర్కారు ప‌డిపోతుంద‌ని ఉండ‌వ‌ల్లి అంచ‌నా వేశారు. అంటే...ఉండ‌వ‌ల్లి చెప్పిన దాని ప్ర‌కారం మోదీ స‌ర్కారు ప్రాణం చంద్రబాబు చేతిలో ఉంద‌న్న మాట‌. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.