Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి లాజిక్: అవిశ్వాసంలో మోడీ ఓడారు

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:21 AM GMT
ఉండ‌వ‌ల్లి లాజిక్: అవిశ్వాసంలో మోడీ ఓడారు
X
అంద‌రికి తెలిసిన విష‌యంలోనూ కొత్త కోణాన్ని చూపించే స‌త్తా కొంద‌రి సొంతం. అలాంటి టాలెంట్ ఏపీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లిలో ట‌న్నుల కొద్దీ ఉంటుంది. త‌న మాట‌ల‌తో అవ‌త‌లోడు ఎంత‌టోడైనా చెమ‌ట‌లు పుట్టించే వాగ్ధాటి ఆయ‌న సొంతం. మిగిలిన విష‌యాల సంగ‌తి ఎలా ఉన్నా. మాట‌ల్లో ఆయ‌న‌తో పెట్టుకోవ‌టానికి చాలామంది వెన‌క‌డుగు వేస్తారు. తాను చెప్పే మాట‌ల్ని ఏదో సొల్లు మాదిరి కాకుండా అందులో విష‌యం ఉన్న‌ట్లు అనిపించే లాజిక్ చూపించ‌టం ఆయ‌న‌లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది.

తాజాగా ఆయ‌న నోట కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య‌న లోక్ స‌భ‌లో టీడీపీ ఎంపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన‌ట్లు వ‌చ్చినా.. నిజానికి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అత్య‌ధిక ఎంపీలు ఓట్లు వేశారు తెలుసా? అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌య్యేలా మాట‌లు చెప్పారు. కావాలంటే రుజువులు ఇదిగో చూడండంటూ నాటి స‌భ‌కు సంబంధించిన వీడియోను చూపించారు.

అందులో స్పీక‌ర్ సాంకేతికంగా అన్న మాట‌ను ఆయ‌న ఎత్తి చూపించ‌టం చూస్తే.. విష‌యాల్ని ఎంత సునిశితంగా ఆయ‌న గ‌మ‌నిస్తార‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అవిశ్వాసానికి వ్య‌తిరేకంగా ఓట్లు వేయ‌మంటే అత్య‌ధికులు ఎస్ అంటూ ఓట్లు వేశార‌ని.. చిన్న పొర‌పాటును ప్ర‌శ్నిస్తారా? అని అంటారు కానీ.. తాను చెప్పింది నిజ‌మ‌న్నారు

ఇక‌.. ఏపీ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ.. ఈ రోజున విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చాలా అడ్వాంటేజ్ ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని.. ఎన్నిక‌లు ఏడాది ఉన్నందున ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్నారు. చంద్ర‌బాబుకు పోల్ మేనేజ్ మెంట్ బాగా తెలుస‌ని.. జ‌గ‌న్ కు ఆ విష‌యం తెలీద‌న్నారు. 2014లోనూ జ‌గ‌న్ విజ‌యం సాధిస్తార‌ని చెప్పార‌ని.. చివ‌రి నిమిషంలో బాబు గెలిచిన విష‌యాన్ని గుర్తు చేశారు. చంద్ర‌బాబును త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌నే తానీ ఉదాహ‌ర‌ణ చెబుతున్న‌ట్లు చెప్పారు.

జ‌గ‌న్ త‌న‌కు చిన్న‌త‌నం నుంచి తెలుస‌ని.. ఆయ‌న త‌మ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కొడుక‌ని.. బాబుతో పోలిస్తే.. ఆయ‌న ద‌గ్గ‌రే ఎక్కువ మంది కాంగ్రెస్ నేత‌లు ఉన్న‌ట్లు చెప్పారు. రేపొద్దున ఏదైనా అవ‌స‌రం వ‌చ్చి.. జ‌గ‌న్ సీఎం అయితేనే త‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అదే బాబుతో అయితే.. తాను ర‌హ‌స్యంగా మాట్లాడాల్సి ఉంటుద‌ని చ‌మ‌త్కారంగా మాట్లాడారు.