Begin typing your search above and press return to search.
ఉండవల్లి పాయింట్ కు సమాధానం చెప్పరేం?
By: Tupaki Desk | 11 Sep 2016 9:14 AM GMTమంచి వాక్ చాతుర్యంతో పాటు.. విషయాల మీద అవగాహన ఉన్న ఏపీ నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. కాకుంటే.. ఆయన ఎప్పుడు మాట్లాడతారో? ఎప్పుడు మౌనంగా ఉంటారో అస్సలు అర్థం కాదు. మాటల వరకే కానీ చేతల విషయంలో ఆయన్ను నమ్మలేని పరిస్థితి. అప్పుడప్పడు మాత్రమే మాట్లాడే ఉండవల్లిలో మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. లా పాయింట్లు లాగినట్లుగా మాట్లాడుతుంటారు.
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తన వాణిని వినిపించే క్రమంలో కేంద్ర వైఖరిని తప్పు పడుతూ కొన్ని లా పాయింట్లు బయటకు తీశారు. వాటిల్లోకి వెళితే.. హోదా అవసరం లేదని చెబుతున్నప్పుడు అసలు పార్లమెంటులో హోదా గురించి ఎందుకు అడిగారంటూ సూటి ప్రశ్నను సంధించారు ఉండవల్లి. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు అబద్ధాలు ఆడి దొరికిపోయారన్న ఆయన.. ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తే బాగుంటుందన్నారు.
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో గట్టిగా పట్టుబట్టిన వెంకయ్య ఈ రోజు హోదాకు భిన్నమైన వాదనను వినిపించటం ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీతోనే టీడీపీ-బీజేపీ కూటమి పవర్ లోకి వచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని స్పష్టం చేసిన ఆయన.. ఆ విషయాన్ని తనతో స్వయంగా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు అభిజిత్ సింగ్ చెప్పారన్నారు.
ఉండవల్లి ప్రస్తావించిన ఈ అంశంపై కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ.. వెంకయ్యనాయుడులు స్పందించాల్సిన అవసరం ఉంది. విభజన కారణంగా పరిశ్రమలు హైదరాబాద్ కే పరిమితం అయ్యాయని.. రెవెన్యూ లోటును ఏ విధంగా భర్తీ చేస్తారన్నది ఇప్పటివరకూ చెప్పలేదన్నారు. ఏపీకిప్రత్యేక హోదా అంశంపై అరుణ్ జైట్లీ వెటకారంగా మాట్లాడారని మండిపడ్డ ఉండవల్లి.. ఇంత జరుగుతున్నా కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు.
అప్పుడెప్పుడో జైట్లీ ఎటకారంగా మాట్లాడితే స్పందించటానికి పదవి లేని ఉండవల్లికే ఇంత టైం తీసుకుంటే.. పవర్ లో ఉండి.. నిత్యం కేంద్రంతో రాసుకుపూసుకునే చంద్రబాబుకు టైం పట్టదా? విమర్శ చేయటం తప్పు కాదు. కానీ.. తప్పులు వెతికే హక్కు తనకుందా అని ఉండవల్లి లాంటివారు తమను తాము ప్రశ్నించుకుంటే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.