Begin typing your search above and press return to search.

ఈసారి ఏపీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ :ఉండవల్లి

By:  Tupaki Desk   |   22 April 2019 6:01 AM GMT
ఈసారి ఏపీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ :ఉండవల్లి
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ నేత - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో పరిస్థితులు ఇలా తయారవుతాయని ఊహించలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు ఏమీ చేయకుండా .. చివరి రోజుల్లో ఎన్నికల ముందు ఖాతాల్లోకి ప్రభుత్వ డబ్బులు వేసే ట్రెండ్ వచ్చిందని.. ఇది ఊహించలేదని అన్నారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి సంచలన విషయాలు మాట్లాడారు.

ఏపీ బడ్జెట్ లో జీతాలు - నిర్వహణకు పోగా డబ్బులన్నీ జనాల ఖాతాల్లో వేశారని.. ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించారని.. వాళ్లు పూర్తి చేసి డబ్బులిస్తేనే నీళ్లు విడుదల చేస్తారు కావచ్చు అని ఉండవల్లి ఎద్దేవా చేశారు. పసుపు కుంకుమ కింద మహిళలు పదివేలు అందిన కృతజ్ఞతతో టీడీపీకి ఓటువేశారా.? లేదా తమ మగవారి చెప్పిన ప్రకారం వైసీపీకి ఓటు వేశారా అని తేలాల్సి ఉందని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో గెలుపు ఓటములు జనసేనపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాతే ఇది తేలుతుందన్నారు.

ఇక కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా.. కార్పొరేషన్ పెట్టినా టీడీపీ ప్రభుత్వం వారి పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని వారు ఆగ్రహంతో ఉన్నారని ఉండవల్లి స్పష్టంచేశారు. కాపుల ఓటు టీడీపీకి పడలేదన్నారు.

మోడీ మరోసారి ప్రధాని అయితే అధ్యక్ష తరహా పాలన దేశంలో వస్తుందని ఉండవల్లి అన్నారు. వైఎస్ కొడుకు జగన్ సీఎం కావాలని ఆశిస్తున్నానని.. అయితే అవుతాడని మాత్రం ఖచ్చితంగా చెప్పలేనని ఉండవల్లి పేర్కొన్నారు.