Begin typing your search above and press return to search.
కోడెల ఆత్మహత్యపై సంచలన నిజాలు భయపెట్టిన ఉండవల్లి..
By: Tupaki Desk | 28 Oct 2019 9:36 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత - నూతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొట్టమొదటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రామారావు కాలం నుండి టీడీపీ లో ఉంటూ ఒక గొప్ప లీడర్ గా రాజకీయాలలో పేరుతెచ్చుకున్న శివప్రసాద్ ఆలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది దురదృష్టకరం. అయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇప్పటికి తెలియలేదు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ..సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాడు అని అనడం అంత మంచిది కాదు అని చెప్పారు. కానీ , జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ ..కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే మాట్లాడుతూ .. కోడెల శివ ప్రసాద్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే, కోడెల గత చరిత్ర గమనించినట్టయితే ఆయన దమ్మున్న నేత - శత్రువుకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు - కోడెల అగ్రెస్సివ్ పొలిటిషన్ - ఆయన ఇంట్లోనే బాంబులుండేవని - అవి ఓ సమయంలో పేలాయని - రామారావు గారిని సీఎం గా దించేసిన సందర్భంలో స్వయంగా పీఎస్ పై కూడా తన అనుచరులతో కలిసి ఆయన దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కోడెల మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టరు కూడా.. అటువంటి వ్యక్తి - ఇప్పుడు జగన్ వంటి నాయకుడు ఇబ్బందులు పెడుతున్నాడనో.. మరెవరో ఏదో అన్నారని ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి కాదన్నారు. ఎప్పుడు కూడా శతృవు తోటి తలపడతారు కానీ - శత్రువుకి బయపడి ఆత్మహత్య చేసుకోరు. అయన ఆత్మహత్య వెనుక ఎదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అయన దగ్గరి వారి నుండి తీవ్రమైనటువంటి అవమానం ఎదో ఎదుర్కొన్నాడు. తనవాడు అనుకున్న వారే ఇబ్బందులలోకి నెట్టేయడంతో ఇక ఈ జీవితం ఎందుకు అని అనిపించి అయన ఆత్మహత్య చేసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. దీనిపై వివరాలు ఏమి తెలియవు ..కానీ , అయన గురించి ఆలోచించినప్పుడు ఇలా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు. కానీ , నేడు ప్రచారం మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి కోడెల పై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాడు ..వెంటాడాడు అని టీడీపీ వారు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అని - వైసీపీ వారు కూడా చంద్రబాబు వైఖరి వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు అని ప్రచారం చేస్తున్నా కూడా టీడీపీ వారి ప్రచారమే ప్రజల్లోకి బాగా వెళ్ళింది అని తెలిపారు.