Begin typing your search above and press return to search.
చంద్రబాబుది పిండారి పాలనః ఉండవల్లి
By: Tupaki Desk | 15 July 2017 10:30 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. తనదైన శైలిలో ఆయన చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విసిరిన సవాలుపై ఆయన స్పందించారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.
అసలు పోలవరం ప్రాజెక్టును కట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ఉండవల్లి ప్రశ్నించారు. గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లలను(సిమెంట్) తలపించేలా పోలవరం స్పిల్ వే నిర్మిస్తున్నారని నిప్పులు చెరిగారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్పిల్‌వే అప్పుడే బీటలు వారిందన్నారు. పోలవరం నిర్మాణ వ్యయం రూ. 40 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో తనకు అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం పిండారి పాలనును మించిపోయిందని ఉండవల్లి ఎద్దేవా చేశారు. వైఎస్ పోలవరాన్ని ఆరంభిస్తే చంద్రబాబు తానే పూర్తి చేస్తున్నానని ఇది తన కల అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ప్రతిపాదించిన విధంగా పోలవరం నిర్మిస్తే అనుకున్న బడ్జెట్ కే పూర్తయ్యేదని, కానీ ప్రభుత్వాలు ఆలస్యం చెయ్యడం వల్ల బడ్జెట్‌ను పెంచేశారని ఆయన విమర్శించారు.
ఈనెల 18న పట్టిసీమ ప్రాజెక్ట్ పై బహిరంగ చర్చకు సిద్ధమైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి సవాల్ ను ఆయన స్వీకరించారు. ప్రాజెక్టుల పై చర్చకు సిద్ధమేనని తెలిపారు. పట్టిసీమ విషయంలో తప్పుడు జీవోలు ఎందుకిచ్చారని, సీడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు నిర్మించారని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల తాత్కాలిక ప్రాజెక్ట్ కోసం 20 ఏళ్లకు డీపీఆర్ ఎందుకు తయారు చేశారో చెప్పాలన్నారు. తాత్కాలిక ప్రాజెక్ట్‌లు పట్టిసీమ - పురుషోత్త పట్నం ఎత్తిపథకాల కోసం రూ. 3600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారని, పట్టిసీమ ప్రాజెక్ట్ కోసం రూ. 391 కోట్లు అదనపు చెల్లింపులు చేశారని కాగ్ తేల్చిందని ఉండవల్లి అన్నారు.