Begin typing your search above and press return to search.

పాదయాత్ర హిట్... అన్నా క్యాంటీన్ ఫట్...

By:  Tupaki Desk   |   2 Jan 2019 2:19 PM GMT
పాదయాత్ర హిట్... అన్నా క్యాంటీన్ ఫట్...
X
ఆంధ్రప్రదేశ్‌ లో నెమ్మదిగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, విపక్షమైన వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రధాన పార్టీలుగా బరిలోకి దిగనున్నాయి. మాటల మాంత్రికుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రెండు పార్టీల అగ్రనేతల అయిన చంద్రబాబు నాయుడు - జగన్ మోహన రెడ్డిపై తనదైన శైలిలో స్పందించారు. . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకూ కూడా పోరాడే తత్వం ఉన్న మనిషి అని ఉండవల్లి అన్నారు. 2014లో జగన్ అధికారంలోకి రావల్సిందే గాని - ఆయన చేజేతులా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పాడుచేసుకున్నారని ఉండవల్లి అన్నారు. వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్. జగన్ మోహన రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని - ఇంతటి స్పందన మరే ఇతర నేతకు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ కూడా ప్రజలను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకా ప్రజల గుండేలలో ఉన్నారని, అందుకే ప్రజలు కూడా జగన్ ను ఆదరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపరీతమైన వ్యతిరేకత ఉందని - ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడు లేదని ఆయన విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతిపై ప్రజలు చాల ఆగ్రహంతో ఉన్నారని, అన్నా క్యాంటీన్ అంతా కూడా వట్టి బూటకమని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేత పత్రాలు అంతా కూడా బూటకమని - అందులో ఏ మాత్రం నిజం లేదని ఆయన బాబును విమర్శించారు. ఒక్క పక్క కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివ్రుద్దికి చేయూత ఇవ్వటం లేదని చెప్తూనే, రాష్ట్ర అభివ్రుద్ది అయినట్టు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని, ఈ రెండిటిలోను ఏది నిజం అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సంవత్సరం జరిగే ఎన్నికలలో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంమని ఆయన అన్నారు. జగన్‌ కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నప్పటికీ కూడా, చంద్రబాబు నాయుడిది చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకోరని - చంద్రబాబుది పోరాడే స్వభావం అని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు నాయుడు భారతంలో దుర్యోధనుడు వంటి వాడని - ఆయన స్వలాభం కోసం ఎంతటి కుట్రలకైన వెనుకాడరని ఉండవల్లి అన్నారు. అయితే ఎన్నికలలో గెలుపు ఎవరిదో వేచీ చూడాల్సిందే అని ఆయన అన్నారు.