Begin typing your search above and press return to search.
పవన్ పై చంద్రబాబు కుట్ర: ఉండవల్లి
By: Tupaki Desk | 2 Jan 2019 4:02 PM GMTనిన్నటివరకు మోదీ - జగన్ - పవన్ ముగ్గురూ కలిసిపోయారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు పవన్‌తో కలిస్తే తప్పేంటి అని అడుగుతున్నారని.. ఇదంతా చంద్రబాబు గేమ్‌ప్లాన్‌లో భాగమని విమర్శించారు ఉండవల్లి అరుణ్ కుమార్. పవన్ పై చంద్రబాబు గేమ్ మొదలైందని.. అందులో భాగంగానే బాబు ఈ కామెంట్స్ చేశారని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడితే.. పవన్ కు రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
“2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశాడు పవన్. ఆ విమర్శలు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే కాంగ్రెస్ కు ఒక్క సీట్ కూడా రాలేదు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ని విమర్శిస్తే పని జరగదు. 2014లో కాంగ్రెస్ ను ఎలా అయితే విమర్శించాడో అలా ఇప్పుడు టీడీపీని దుయ్యబట్టాలి. అప్పుడే జనం కనెక్ట్ అవుతారు. దాన్నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఇప్పుడు గేమ్ ఆడడం మొదలుపెట్టారు. నేను - పవన్ కలిస్తే తప్పేంటి అని అనడం వల్ల చంద్రబాబు-పవన్ ఎప్పటికైనా ఒకటే అనే ఫీలింగ్ జనాలకు తెప్పిస్తాడు.దీంతో.. పవన్ వెనుక అండగా నిలబడిన వాళ్లంతా ఒక్కొక్కరిగా వెళ్లిపోతారు. ఎందుకంటే పవన్ వెంట ఉండే జనం అంతా ఎమోషనల్. ఈ విషయం చంద్రబాబుకి తెలుసు. అందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు” అని ఆరోపించారు ఉండవల్లి.
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తుపై కూడా మాట్లాడారు ఉండవల్లి. అసలు పవన్ కు గుర్తే అవసరం లేదని.. ఆయనే జనసేనకు ఉన్న గుర్తు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందన్న ఉండవల్లి.. రూలింగ్ లోకి వచ్చేంత సీట్లు అయితే జనసేనకు రావని తేల్చిచెప్పారు.