Begin typing your search above and press return to search.

లోకేష్‌ ను పప్పు అన‌డం క‌రెక్ట‌ని తేల్చేశారు

By:  Tupaki Desk   |   26 April 2017 4:10 PM GMT
లోకేష్‌ ను పప్పు అన‌డం క‌రెక్ట‌ని తేల్చేశారు
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ విష‌యంలో విప‌క్షాలు త‌మ వాగ్భాణాలు సంధిస్తూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - న్యాయ‌వాది అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. మంత్రి నారా లోకేశ్‌ ను పప్పు అనడంలో తప్పేంలేదని వ్యాఖ్యానించారు. లోకేష్ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్కారు అతిగా స్పందించి న‌వ్వుల పాలు అవ‌డంతో పాటుగా ఇర‌కాటంలో సైతం ప‌డింద‌ని ఉండ‌వల్లి వ్యాఖ్యానించారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ల‌పై త‌గు రీతిలో స్పందించ‌డం లేద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ మండిప‌డ్డారు. ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని...ఈ విష‌యాన్ని గ‌తంలో తాను లేఖ‌ల ద్వారా చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్లాన‌ని గుర్తుచేశారు. తాజాగా సైతం స‌మ‌స్య‌ల కంటే సొంత ఎజెండాల‌పై ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్తూ 2018 నాటికి గ్రావిటీ ద్వారా తాగునీరు వస్తుందని ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ఉండ‌వ‌ల్లి ఎద్దేవా చేశారు. ఒక‌వేళ అలా చేయగలిగితే ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడతాయని చెప్పారు. కాఫర్‌ డ్యామ్‌ ద్వారా నీళ్లు ఇస్తామంటున్నారని, అసలు కాఫర్‌ డ్యామ్‌ ఎక్కడ ఉందని ఉండ‌వ‌ల్లి ప్రశ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/