Begin typing your search above and press return to search.

మోడీతో ఉండవల్లి ఢీ?

By:  Tupaki Desk   |   12 Nov 2016 9:42 AM GMT
మోడీతో ఉండవల్లి ఢీ?
X
ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి తీవ్రంగా తప్పు పట్టారు. నల్లధనాన్ని అరికట్టాలన్న ఆయన ఆలోచనను స్వాగతించిన ఆయన అందుకు అనుసరిస్తున్న ఈ విధానాన్ని మాత్రం తప్పుపట్టారు. గతంలో ఎవరూ ఇలాంటి తప్పు చేయలేదని ఆయన మండిపడ్డారు. మోడీ నిర్ణయం కారణంగా దేశంలో ఎకనామిక్ ఎమర్జెన్సీని ఏర్పడిందన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ చేసిన ప్రకటనతో దేశంలోని కష్ట జీవులకు దెబ్బ తగిలిందని అరుణ్ కుమార్ తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల మోడీ లక్స్యం నెరవేరలేదు. ఈ  బ్లాక్ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఉండవల్లి పేర్కొన్నారు. గతంలో రూ. 96వేల కోట్ల మేర విదేశాలకు తరలిపోతే.. ఈ ఏడాది రూ. 2లక్షల76వేల కోట్లు బయటకు పోయిందని తెలిపారు. మోడీ అనుభవ రాహిత్యమే దీనికి కారణమని ఉండవల్లి ఆరోపించారు.

దేశంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఏడాది పాటు సామాన్యులపై ఉంటుందని అన్నారు. అయితే... నల్లధనం నిరోధానికి ఏం చేయాలో మాత్రం ఉండవల్లి చెప్పలేదు. అయితే.. న్యాయ పోరాటాలకు పేరుగాంచిన ఉండవల్లి దీనిపైనా కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/