Begin typing your search above and press return to search.
బాబుకు ఆ స్కెచ్ నచ్చితే.. మోడీ మట్టి కరచినట్టేనా?
By: Tupaki Desk | 6 Feb 2018 7:18 AM GMTచంద్రబాబునాయుడు అధికారాన్ని దక్కించుకోవడంలో ఎంత కర్కశంగా ఉండల రాజకీయ నాయకుడో ఆయన ట్రాక్ రికార్డు తెలిసిన వారందరికీ అవగాహన ఉంటుంది. కేవలం తను అధికారం దక్కించుకోవడానికి మాత్రమే కాదు, తాను తలచిన వారికి అధికారం కట్టబెట్టడానికి కూడా ఆయన అంతే సమంగా కర్కశమైన రాజకీయ వ్యూహాలను సిద్ధంచేసి.. చక్రం తిప్పగల చాణక్యుడు అనే సంగతి అందరికీ తెలుసు. ముప్పయ్యేళ్ల కిందట చంద్రబాబు లైమ్ లైట్ లోకి వచ్చిన పరిణామాలనుంచి అన్నీ ఇలాంటి వ్యూహనైపుణ్యాలే ఆయన సొత్తు. అలాంటి చాణక్య చంద్రబాబుకే దిమ్మతిరిగి వ్యూహాన్ని మాజీ ఎంపీ ఉండవిల్లి అందిస్తున్నారు. చంద్రబాబు ను వ్యతిరేకించే నాయకుడే అయినప్పటికీ.. చంద్రబాబు సత్తా ఏమిటో పూర్తిగా తెలిసిన ఉండవిల్లి.. ఆయన తలచుకుంటే.. మోడీ సర్కారు మట్టి కరుస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏ రకమైన స్కెచ్ ను ఫాలో అయితే బాబు మోడీ సర్కారును తన గుప్పిట పెట్టుకుని ఆడించవచ్చునో కూడా ఉండవిల్లి ప్లాన్ అందిస్తున్నారు.
ఉండవిల్లి చెబుతున్న ప్రకారం...
కేంద్రంలో భాజపా తమకంటూ సొంతంగా పూర్తి మెజారిటీ ఉన్న పార్టీనే కావొచ్చు గాక.. కానీ ఆ పార్టీలో కూడా మోడీ నాయకత్వం పట్ల బోలెడు లుకలుకలు ఉన్నాయన్నది సత్యం. అధికారం మీద ఇప్పటికే దాదాపు పదిమందికి పైగా ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మాట కూడా నిజం. అలాగే భాజపా సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా - శతృఘ్న సిన్హా వంటి వారు కూడా మోడీని వ్యతిరేకిస్తున్న మాటా వాస్తవం. వీరందరినీ కలుపుకుని చక్రం తిప్పగలిగితే.. మోడీ సర్కారు కుప్ప కూలగలదని ఉండవిల్లి సలహా ఇస్తున్నారు.
ఎన్డీయే కూటమి నుంచి శివసేన పార్టీ ఇప్పటికే బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ దాదాపుగా అదే బాటలో ఉంది. ఇంకా శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు కూడా... మోడీ ప్రభుత్వ తీరు పట్ల చాలా విముఖంగానే ఉన్నాయి. ఇలాంటి పార్టీలను చంద్రబాబునాయుడు ఒక్కతాటి మీదకు తేగలిగారంటే.. మోడీ సర్కార్ కు స్టార్స్ చూపించడం చిటికెలో పని అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు మిత్రధర్మం పాటిస్తూ.. మోడీ వంచనను సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆయన ఆగ్రహించి.. చక్రం తిప్పితే.. కేంద్రానికి గడ్డుకాలమే అని.. ఈ రెండు రోజల ప్రకటనల్లో కొందరు తెలుగుదేశం ఎంపీలు కూడా హెచ్చరించిన వైనం గుర్తు చేసుకుంటే.. రాజకీయంగా ఏం జరిగినా ఆశ్చర్యం లేదని అనిపిస్తోంది.