Begin typing your search above and press return to search.
నంద్యాలలో బాబు గెలుపుపై ఉండవల్లి మాట!
By: Tupaki Desk | 18 Sep 2017 11:51 AM GMTకర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీడీపీ విజయం సాధించింది. విపక్ష వైసీపీతో హోరాహోరీగా తలపడిన టీడీపీ... ఒకానొక దశలో ఓటమి తప్పదని కూడా భయపడిపోయింది. అయితే పోల్ మేనేజ్ మెంట్ లో దిట్టగా వినుతికెక్కిన ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేవలం రోజుల వ్యవధిలోనే మొత్తం పిక్చర్ ను మార్చేశారు. ఇందుకోసం తన పార్టీకి చెందిన 12 మంది మంత్రులు - 50 మంది దాకా ఎమ్మెల్యేలను అక్కడ మోహరించిన చంద్రబాబు... తనదైన పక్కా ప్లానింగ్ ను అమలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఓటర్లకు బెదిరింపులతో పాటు భారీ ఎత్తున తాయిలాలు కూడా అందాయన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలన్నింటినీ కొట్లిపారేసిన బాబు అండ్ కో... జనం తమ వెంటే ఉన్నారని, ఇందుకు నంద్యాల ఫలితమే నిదర్శనమని చెప్పుకుంది.
అయితే బాబు అండ్ కో చెప్పిన మాటలో ఏమాత్రం సత్యం లేదని - అధికార పార్టీ అడ్డదారులు తొక్కిన మాట వాస్తవమేనని ఇప్పుడు పక్కా ఆధారాలతో సహా తేలిపోయింది. ఈ దిశగా ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఆధారాలు ఆషామాషీగా ఏమీ లేవు. పక్కాగా పత్రాలతో సహా బాబు మంత్రాంగాన్ని బట్టబయలు చేశాయనే చెప్పాలి. ఆ విషయంలోకి వెళితే... కాసేపటి క్రితం సీనియర్ పొలిటీషియన్ - రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి నంద్యాలలో అధికార పార్టీ తొక్కిన అడ్డదారులు ఇవేనంటూ కుండబద్దలు కొట్టేశారు. అధికార పార్టీగా ఉన్న టీడీపీ నంద్యాలలో ఏవిధంగా విజయం సాధించిందో రట్టు చేశారు. గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని ఆధారాలతో సహా వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రతి డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో రూ.4 వేలు చొప్పున జమ చేశారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. జూలై 17 నుంచి ప్రారంభించి నెల రోజుల్లో ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈ నగదు వేశారని ఆయన తెలిపారు.
ఈ విషయంపై ఉండవల్లి ఏమన్నారంటే... *మిగతా ప్రాంతాల్లో కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు వేశారేమో కనుక్కుందామని రాజమండ్రి - పాలకొల్లు బ్యాంకుల్లో పని చేస్తున్న నా మిత్రులకు ఫోన్ చేసి అడిగాను. నగర పాలక ఎన్నికలు జరిగిన కాకినాడలోనూ డ్వాక్రా ఖాతాల్లోనూ డబ్బులు వేయలేదని తేలింది. నాకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక్క నంద్యాలలోనే డ్వాక్రా మహిళల అకౌంట్లలో రూ.4 వేలు చొప్పున జమ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశం. సచ్ఛీలుడు - నీతినిజాయితీకి మారుపేరైన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలి* అని ఉండవల్లి అన్నారు. ఇదంతా చూస్తుంటే... నంద్యాలలో గెలుపే లక్ష్యంగా సాగించిన తన మంత్రాంగంతో చంద్రబాబు మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.