Begin typing your search above and press return to search.
అద్వానీని చూపి... బాబుకు దెబ్బేశాడు!
By: Tupaki Desk | 5 July 2018 11:13 AM GMTఏపీలో అధికార పార్టీ టీడీపీపై ఎదురు దాడి నానాటికీ అధికమవుతోంది. ఇందుకు ఇతరులను కారణంగా చూపడం కంటే కూడా టీడీపీ వ్యవహరించిన తీరే కారణమన్న వాదన కూడా లేకపోలేదు. గడచిన ఎన్నికల సందర్భంగా బీజేపీ - జనసేనతో కలిసి పోటీకి దిగిన టీడీపీ... గుడ్డిలో మెల్ల మాదిరి... అమలు సాధ్యం కాని హామీలన్ని ఇచ్చేసి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలును మరిచి తనదైన శైలి పాలనను సాగించింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుతో భుజం భుజం కలిసి రాసుకుంటూ తిరిగిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... మొన్నటి కేంద్ర బడ్జెట్ తర్వాత విపక్షాల నిలదీసిన ప్రశ్నలకు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించక తప్పలేదు. అప్పటిదాకా బీజేపీ చెప్పినట్టుగా ఆడేసి... ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ - అసలు ఆ పేరు ఎత్తితే జైల్లో పెట్టిస్తామంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు... ఆ తర్వాత తాను వద్దన్న హోదానే కావాలంటూ ఇప్పుడు కొత్త పోరాటం మొదలెట్టేశారు. అసలు నాడు తానే వద్దన్న ప్రత్యేక హోదాను ఇప్పుడు తానే కావాలంటూ అడిగితే... జనం ఏమనుకుంటారోనన్న జంకు ఏమాత్రం లేకుండా చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు నిజంగా వినడానికే చాలా విడ్డూరంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు కూడా చాలా అసహనానికి గురవుతున్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తంగా పరిస్థితులు ఎదురు తిరిగిన నేపథ్యంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు చంద్రబాబు చేస్తున్న యత్నాలు జనానికి కంపరమెత్తిస్తున్నాయన్న విశ్లేషణలు కూడా బాగానే పెరిగిపోయాయి.
అసలే జనం నుంచి వస్తున్న వ్యతిరేకత దెబ్బకు నానా ఇబ్బందులు పడిపోతున్న చంద్రబాబుకు ఇప్పుడు ఇంకో తలనొప్పి స్వాగతం పలికింది. సీనియర్ రాజకీయవేత్త - అన్ని విషయాలపై పరిపూర్ణ అవగాహన ఉన్న నేతగా పేరున్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా సంధించిన లేఖ ఇప్పుడు చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టేలాగే కనిపిస్తోంది. ఉండవల్లి లేఖలో ఏముందన్న విషయానికి వస్తే... ఏపీకి అన్యాయం జరుగుతున్న తీరుపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులో మోదీ సర్కారును ఎందుకు నిలదీయడం లేదన్నది ఆ లేఖ సారాంశం. నాడు రాష్ట్ర విభజనకు సంబంధించి బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన సందర్భంగా జరిగిన పరిణామాలను ఏకరువు పెట్టిన ఉండవల్లి... నాటి పరిస్థితులను సభలో పెట్టి మోదీ సర్కారును దులిపేసే అవకాశం ఉందని చంద్రబాబుకు గుర్తు చేశారు. అంతేకాకుండా... బీజేపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత ఎల్కే అద్వానీ పేరును ప్రస్తావించిన ఉండవల్లి... టీడీపీ నేతలు ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అద్వానీ మొత్తం కథ విప్పుతారని కూడా చెప్పారు. మొత్తంగా బీజేపీపై టీడీపీ సాగించాల్సిన పోరుకు అద్వానీ మద్దతు పలుకుతారని - అలాంటప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు ధైర్యం చేయడం లేదన్నది ఉండవల్లి ప్రశ్న. కాసేపటి క్రితం రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుకు రాసిన లేఖను విడుదల చేసిన ఉండవల్లి... చాలా విషయాలు మాట్లాడారు.
*నాడు సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్ సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో రాష్ట్రనేతలు నిలదీయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్ లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. మీడియాకు పార్లమెంట్ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీల)కు ఉంది. మీకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్ లో ప్రశ్నించాలి* అని ఉండవల్లి సదరు లేఖలో డిమాండ్ చేశారు. మరి ఈ లేఖకు చంద్రబాబు అండ్ కో నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.