Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో ఆంధ్రా ఆవేద‌నా ఉండ‌వ‌ల్లి?

By:  Tupaki Desk   |   24 Aug 2015 12:45 PM GMT
హైద‌రాబాద్‌ లో ఆంధ్రా ఆవేద‌నా ఉండ‌వ‌ల్లి?
X
చాలా రోజుల త‌ర్వాత ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ గ‌ళం విప్పారు. వైఎస్ కు వీర విధేయుడిగా.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు ఇంధ‌నంలా త‌న తెలివిని అందించిన అతికొద్ది సన్నిహితుల్లో ఉండ‌వ‌ల్లి ఒక‌రు. అలాంటి ఆయ‌న తెలివితేట‌ల్ని గ‌తంలోనే తెలుగు ప్ర‌జ‌లు చూసేలా చేశారు వైఎస్‌. అలాంటి వాద‌నా ప‌టిమ ఉన్న వ్య‌క్తి సీమాంధ్ర ఎంపీగా ఉంటే.. విష‌యం ఏదైనా ఇర‌గ‌దీసేస్తార‌నుకున్నారు.

కానీ.. అందుకు భిన్నంగా అమ్మ‌కు దాసోహం అన్నారే త‌ప్పి.. గట్టిగా నిల‌దీసింది లేదు. కాక‌పోతే.. విభ‌జ‌న సంద‌ర్భంగా నాటి కాంగ్రెస్ నేత‌ల‌తో పోలితే.. కొద్దిలో కొంత మెరుగ్గా.. విభ‌జ‌న తీరును విమ‌ర్శించి కాంగ్రెస్ తో రామ్ రామ్ అని చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. విభ‌జ‌న వ‌ల్ల ఎంత న‌ష్టం జ‌రిగింద‌న్న అంశం మీద ప్ర‌చారం చేసి.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చి.. సీమాంధ్ర స‌మ‌స్య‌ల మీద పోరాడారా? అంటే అదీ లేదు.

అప్పుడ‌ప్పుడు మీడియా స‌మావేశాలు పెట్ట‌టం మిన‌హా ఆయ‌న చేస్తున్న‌ది ఏమీ లేదు. తాజాగా ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడ్ని క‌లిపి హోల్‌ సేల్‌ గా ఉతికేశారు. స‌మ‌న్యాయం అంటే ఏమిటో చెప్పాల‌ని చంద్ర‌బాబును డిమాండ్ చేసిన ఆయ‌న‌.. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి న్యాయం చేస్తాన‌ని చెప్పిన వెంక‌య్య‌.. విభ‌జ‌న బిల్లు ఆమోదించే స‌మ‌యంలో నాటి కాంగ్రెస్ దుర్మార్గంతో చేతులు క‌లిపిన విష‌యాన్ని గుర్తు చేశారు.

మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. సీమాంధ్ర‌కు ఎలాంటి న్యాయం చేయ‌లేద‌న్న విష‌యాన్ని ఉదాహ‌ర‌ణ‌లతో స‌హా చెప్పిన ఉండ‌వ‌ల్లి.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ఏ ర‌కంగా న‌ష్ట‌పోయిందో ఏక‌రువు పెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఉండ‌వ‌ల్లి.. ఏపీ క‌ష్టాలు.. న‌ష్టాల గురించి హైద‌రాబాద్ లో కూర్చొని మాట్లాడ‌టం ఏమిటి? ఉమ్మ‌డి రాజ‌ధాని అనా..?

పార్టీ ఫిరాయింపుల‌పై వెంక‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌కు ఉండ‌వ‌ల్లి కౌంట‌ర్ ఇస్తూ..చొక్కాలు మార్చ‌కూడ‌ద‌ని రాజ్యాంగంలో ఎక్క‌డా లేద‌ని..తాడేప‌ల్లిగూడెం స‌భ‌లో వెంకయ్య‌, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు త‌ప్ప అంద‌రూ చొక్కాలు మార్చిన‌వారేన‌ని ఎద్దేవా చేశారు. ఇక చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ ఆయ‌న‌కు పెద్ద అగ్ని ప‌రీక్ష అని ఆయ‌న గెలిచి ప్ర‌త్యేక హోదాతో వ‌స్తే రాష్ర్టంలో ప్ర‌తిప‌క్షాల‌కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని..లేక‌పోతే చంద్ర‌బాబుకు ఏపీలో భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు కాంగ్రెస్ ఎంతో చేసినా..రాష్ర్ట విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం చేసింద‌ని ఆరోపించారు.