Begin typing your search above and press return to search.
25 సీట్లతో చక్రం ఎలా తిప్పుతారో చెప్పండి బాబు?
By: Tupaki Desk | 30 May 2018 8:24 AM GMTసాఫ్ట్ గా కనిపిస్తూనే తన మాటలతో షాకుల మీద షాకులు ఇచ్చే తత్త్వం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కాస్త ఎక్కువ. ఎలాంటి వారినైనా తన మాటలతో డిఫెన్స్ లో పడేస్తుంటారు. ఏదైనా అంశంపై వాదన వినిపించటం మొదలెడితే.. ప్రత్యర్థులు సైతం ఆయన వాదనకు కన్వీన్స్ అయ్యేలా ఉండటం ఉండవల్లి ప్రత్యేకత.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా అంశంపై పలుమార్లు యూటర్న్ లు తీసుకున్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో ఏపీ ప్రజల్లో పెరుగుతున్న హోదా సెంటిమెంట్ నేపథ్యంలో బీజేపీతో కటీఫ్ చెప్పటం తెలిసిందే. బీజేపీతో దోస్తీకి చెల్లుచీటి ఇచ్చిన నాటినుంచి అదే పనిగా మోడీ పరివారంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని ప్రస్తావిస్తూ ఉండవల్లి ఆసక్తికర ప్రశ్నల్ని సంధించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను తనకు కట్టబెడితే హోదాను సాధిస్తానని చంద్రబాబు చెప్పటాన్ని ఉండవల్లి తప్పు పట్టారు. ఏపీలో ఉన్నదే 25 లోక్ సభా స్థానాలు అయినప్పడు.. పాతిక మంది ఎంపీలతో ఢిల్లీలో చంద్రబాబు ఎలా చక్రం తిప్పుతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాతిక మంది ఎంపీలతో బాబు ఏమీ చేయలేరన్న మాటను చెప్పిన ఉండవల్లి.. ఎంపీ సీట్లను గెలుచుకోవటం కోసమే బాబు ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తప్పు పట్టారు.
ఏపీ విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని.. విభజన బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా పాస్ చేసిన వైనాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. విభజన బిల్లు ఆమోదించే సమయంలో లైవ్ టెలికాస్ట్ ను ఎందుకు ఆపేశారంటూ క్వశ్చన్ చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక అడుగు ముందుకు వేశారన్నారు. ఈ సందర్భంగా బాబు తీరును తప్పు పట్టారు. పార్లమెంటులో విభజన బిల్లు మీద చర్చ జరిగితే తప్పు ఎవరిదో తెలుస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానాల్ని గెలుచుకునేందుకు ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయన్నారు. విభజన బిల్లును ఆమోదించే సమయంలో ఓటింగ్ సరిగా నిర్వహించలేదని.. పార్లమెంటు తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారన్నారు. లైవ్ ప్రసారం కానీ ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవన్న ఆయన.. కేంద్రం ఇచ్చిన నిధులపై అడిగే హక్కు ఎవరికి ఉందో బాబు చెప్పాలన్నారు. కర్ణాటకలో జరిగిన బల నిరూపణ పరీక్షను లైవ్ లో టెలికాస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్డు ఆదేశించటం కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడిందని లేని పక్షంలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపితే తప్పేంటన్న ఉండవల్లి.. ఆదే ప్రశ్నను చంద్రబాబుకు సంధించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. నిజానిజాలు తేలాల్సిన బాధ్యత ఉందన్న ఆయన.. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.