Begin typing your search above and press return to search.
ఆయన సీనియారిటీ ఏపీకి పనికిరాలేదు
By: Tupaki Desk | 19 Jun 2018 1:30 AM GMTఒకపుడు ఐటీ హైదరాబాదుకు వస్తున్న సమయంలో ఇక్కడి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పలు లాంచింగ్ లలో పాల్గొనే వారు. ఆ సందర్భంగా ఏర్పాటుచేసే ప్రారంభ సమావేశాల్లో సహజంగానే రాష్ట్ర పాలకుడు ముఖ్యఅతిథి. అతడిని విస్మరించి ఒక రాష్ట్రంలో ఎంత తోపు కంపెనీ అయినా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అటువైపు ఎంత పెద్ద కంపెనీ అయినా నాలుగు పొగడ్తలు విసరడం మామూలే. అలాంటి పొగడ్తలు కాలం కలిసొచ్చి బాబు అక్కౌంట్ లో కొన్ని పడ్డాయి. ఇక యెల్లో టీం దానిని చాలా పకడ్బంధీగా ప్రచారంలోకి దించి బాబు మహా తోపు అని నమ్మించగలిగింది.
అన్ని పార్టీల వద్ద బాబుకు మించిన టెక్ టీంలు ఉన్నాయి. బాబు నోట ఒక్క మాట జారినా రచ్చ కీడుస్తున్నాయి. అలా కొంతకాలంగా బాబు సత్తా - బండారం అంతా బయటపడింది. రాష్ట్ర విభజన నాడు ఆ తోపు కనీసం వేలు పెట్టలేకపోయారు. ఆపలేకపోయారు. మోడీతో కలిసి రాష్ట్రం నెం.1 చేస్తానని అదీ చేయలేకపోయారు. కనీసం మిత్ర పక్షంగా ఉంటూ ప్రధాని అపాయింట్ మెంట్ దక్కించుకోలేకపోయారు. మొదటి ఆరు నెలల్లోనే చంద్రబాబుకు మోడీ ఓ వార్నింగ్ ఇచ్చారు. పదేపదే ఢిల్లీకి వచ్చి లాబీయింగ్ లు చేయకండి అని కొంచెం గట్టిగానే చెప్పారు మోడీ. ఆ వ్యాఖ్య బాబుకు ఒక పెద్ద షాక్. దాంతో మోడీ వద్ద బాబుకు ఎంత వెయిట్ ఉందో అర్థమైపోయింది. అంతకముందు బాబు ఢిల్లీ టూర్ అంటే ఒక భారీ ప్రచారం ఉండేది. ఆ తర్వాత అన్నీ లో ప్రొఫైల్ టూర్లు వేయాల్సి వచ్చింది.
ఇక రాష్ట్ర ప్రజలకు ఎన్నికలపుడు ఇచ్చిన హామీల అమలులోను బాబు ఘోరంగా విఫలమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో బాబు చాణక్యాలేవీ పనిచేయలేదు. ప్రతిపక్షం బలంగా ఉండటంతో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవడంతోనే సరిపోయింది. టెక్నాలజీ కబుర్లు కూడా పనిచేయలేదు. దీంతో బాబు గ్రాఫ్ భారీగా పడిపోతూ వచ్చింది. ఈరోజు జగన్ కు బాబుకు పట్టున్న ప్రాంతాల్లో బ్రహ్మరథం పడుతున్నారంటే అది బాబు వైఫల్యం. ఒకపుడు బాబు గురించి వ్యాఖ్యలు చేయడానికి సీనియర్లు కూడా జంకే వారు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక బాబు ఏం చేయలేకపోయారో... ఒక సీఎం ఏం చేయొచ్చో వైఎస్ నిరూపించారు. ఆ తర్వాత బాబుపై నేతలకు ఒక క్లారిటీ వచ్చింది. చంద్రబాబు ప్రమోట్ చేసుకున్నంత సీన్ లేదని తేలింది. ఇక అప్పట్నుంచి చంద్రబాబుపై ఎపుడూ మాట్లాడని వారు కూడా ఎన్నో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కొన్ని విమర్శలకు పార్టీ నుంచి సమాధానం కూడా రాలేని పరిస్థితి.
తాజాగా ఉండవల్లి ఏమన్నారో వినండి... అందులో ఒక్క మాట కూడా అబద్ధం లేదు అని ఎవరికైనా అర్థమవుతుంది. *చంద్రబాబు ఏదో ఒక మాటపై స్థిరంగా ఉంటే బాగుండేది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలో - ప్యాకేజ్ కావాలో తేల్చుకోలేని స్థితిలో చంద్రబాబు ఉండిపోయారని - అందుకే, పలుసార్లు మాట మార్చారు* అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. నిజమే కదా. బాబు ప్యాకేజీ గురించి ఎంత గొప్పగా చెప్పిందీ ఇప్పటికీ ఇంటర్నెట్ లో దొరుకుతోంది. నిజంగా చంద్రబాబు హోదా-ప్యాకేజీ-హోదా అని మాట మార్చారు. ఏదో ఒకదానిపై ఉండి ఉంటే ఈరోజు ఇంత పతనం అయ్యి ఉండేవారు కాదు. టీడీపీ శ్రేణుల్లో రాజకీయ ప్రకంపనాలు వచ్చాయంటే అది బాబు పదేపదే మాట మార్చడం వల్లే కదా.