Begin typing your search above and press return to search.
జాగ్రత్తపడితే జగనే సీఎం..ఆయనపై కేసులంతా ఉత్తవే
By: Tupaki Desk | 6 Aug 2018 5:04 PM GMTవైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డి అంటే అభిమానం చూపే మాజీ ఎంపీ ఉండవల్లి మరోసారి జగన్ సీబీఐ కేసుల నుంచి సులభంగా బయటపడతారని చెప్పారు. ఆ కేసులు నిరూపించడానికి ఏమాత్రం ఆధారాలు లేవని.. అందుకే జగన్ నిర్దోషిగా బయటకొస్తారని అన్నారు.
ఒక టీవీ చానల్ లైవ్ షోలో మాట్లాడిన ఆయన జగన్ పై ఉన్న కేసుల్లో దర్యాప్తు గురించి మాట్లాడారు. ఆయనపై చేసిన ఫిర్యాదుల్లో ఏం ఉందో సీబీఐ పదేపదే అదే విషయం చెప్తోంది కానీ జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయిందన్నారు.
తన తండ్రి, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుర్చీని అడ్డం పెట్టుకుని జగన్ తన కంపెనీల్లోకి పెట్టుబడులు ఆహ్వానించారనడానికి సీబీఐ దగ్గర ఆధారాల్లేవన్నారు.మిగతా అన్ని కంపెనీల మాదిరిగానే ప్రభుత్వ పాలసీ ప్రకారమ జగన్ కంపెనీలకు కూడా భూమి కేటాయించడం, ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.
వైఎస్ కుమారుడిగా జగన్ అంటే తనకు అభిమానమని ఉండవల్లి చెప్పారు. సరైన ఆట ఆడితే సీఎం కావడానికి జగన్ కు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. జగన్ సీఎం అయితే తనకే పని కావాలన్నీ సులభంగా వెళ్లగలనని.. ఆయన మంత్రివర్గంలో ఉండబోయేవారంతా తన పాతమిత్రులే కావడంతో తనకు పనిచేసి పెడతారని అన్నారు. అదే చంద్రబాబు సీఎం అయితే మాత్రం ఆయన దగ్గర మంత్రులెవరూ తనకు తెలియదు కాబట్టి తానేమీ చేయలేనన్నారు.