Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి క్లారిటీ-వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను

By:  Tupaki Desk   |   3 July 2017 3:04 PM GMT
ఉండ‌వ‌ల్లి క్లారిటీ-వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను
X
సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ సాధార‌ణంగా ఏ విష‌యంపై అయినా దారాళంగా మాట్లాడ‌గ‌ల‌రు. త‌డుముకోకుండా స‌మాచారం చెప్ప‌డంలో, ప్ర‌శ్న‌లు సంధించ‌డంలోనూ ఉండ‌వ‌ల్లిది అందెవేసిన చేయి. అలాంటి ఉండ‌వ‌ల్లిని ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీలు గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నాయ‌ట‌. ఈ మాట చెప్పింది సాక్షాత్తు ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమారే! కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుతో కలిసి కొత్త అసెంబ్లీ చూడడానికి వచ్చిన ఉండవల్లి మీడియాతో ముచ్చటిస్తూ ఈ మాట చెప్పారు.

ఏపీ నూతన సచివాలయానికి విచ్చేసిన అనంత‌రం ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ...అసెంబ్లీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ విషయాన్ని మల్లాది విష్ణుకు చెబితే ఆయన ఈ రోజు బాగుందని చెప్పి వెళ్దామంటే వచ్చానని ఉండవల్లి చెప్పారు. ఇంత‌కీ అసెంబ్లీ ఎలా ఉంది అని విలేక‌రి ఒక‌రు ప్ర‌శ్నించ‌గా... ‘కొత్త అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్ల‌నున్న ఉండ‌వ‌ల్లి అంటారు. అసెంబ్లీ బాగాలేదంటే ప్ర‌తిప‌క్ష‌ వైసీపీలో చేరుతున్నట్లున్నారే అంటారు’ అని చ‌మ‌త్కారంగా స్పందించారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్షపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన అవసరం లేదని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తనకు టీడీపీలోనూ, వైసీపీలోనూ తెలిసినవాళ్లు ఎవరూ లేరని అందుకే మల్లాది విష్ణుతో కలిసి వచ్చానని ఉండవల్లి అరుణ్‌ కుమార్ వివ‌ర‌ణ ఇచ్చారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/