Begin typing your search above and press return to search.
ఊసరవెల్లేనా : వీర సమైక్యతావాదికి కేసీయార్ గొప్పగా కనిపించారా...?
By: Tupaki Desk | 14 Jun 2022 1:49 PM GMTఆయన నిజాయతీ మీద చిత్తశుద్ధి మీద ఇప్పటిదాకా ఎవరికీ ఏ రకమైన డౌట్లు లేవు. ఆయనకు రాజకీయాలు ఒక పాషన్ అని అంతా అనుకుంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడబెట్టుకున్నది కూడా ఏమీ లేదు. ఇక తనకు రెండు సార్లు దక్కిన ఎంపీ పదవే మహద్భాగ్యమని ఆయన పదే పదే చెప్పుకుంటారు. ఇక ఏపీ గురించి అందరి కంటే ఎక్కువ ఆవేదన చెందేవారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్.
ఆయన సడెన్ గా తెలంగాణా సీఎం కేసీయార్ తో భేటీ అయ్యారన్న వార్తలే సంచలనం రేకెత్తించాయి. ఆయనతో గంటల తరబడి కూర్చుని మాట్లాడడమే కాకుండా లంచ్ చేసి మరీ వచ్చారు. అంతే కాదు, తన ఇలాకా అయిన రాజమండ్రీలో మీడియాను పిలిచి మరీ కేసీయార్ ఈజ్ గ్రేట్ అని చెప్పడం ఇంకా విశేషం. కేసీయార్ కంటే మొనగాడు, మోడీని ఢీ కొట్టే వారు ఎవరూ లేరు అని కూడా కితాబు ఇచ్చేశారు.
ఇంతలో ఎంత మార్పు ఉండవల్లి గారూ అని సమైక్యవాదులు అంతా నివ్వెరపోతున్న వేళ ఉండవల్లి మాత్రం తానూ కేసీయార్ బీజేపీ వ్యతిరేక భావజాలంలో ఒక్కటే అని చెప్పి కొన్ని డౌట్లు క్లారిఫై చేస్తూ మరికొన్ని డౌట్లు పెట్టేశారు. నిజానికి ఉండవల్లి కేసీయార్ ని కలవడంతో తప్పు లేదు, కానీ ఉండవల్లి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇదే కేసీయార్ ని ఏమన్నారో చూడాలి. ఆయనకు గుర్తుందో లేదో తెలియదు కానీ కేసీయార్ మీద అలుపెరగని పోరాటం చేసిన వారిలో ఏపీ నుంచి ఆయన అగ్ర భాగాన ఉన్నారు.
అంతే కాదు కేసీయార్ మాటల చాతుర్యానికి ఏపీ నుంచి అడ్డుకట్ట వేసి లాజిక్ తో కూడిన జవాబు చెప్పిన వారులో ఉండవల్లి మొదటి స్థానంలో ఉంటారు. మా నీళ్ళూ, మా నిధులు, మా నియామకాలు అంటూ కేసీయార్ నాడు చేసిన నినాదాలకు సరైన సమాధానం ఉండవల్లే చెప్పారు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లనే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బయటకు నెట్టేశారు అని ఆంధ్రుల మీద కేసీయార్ అంటే చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు అంటూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని కూడా వివరించిన ఘనాపాఠి ఉండవల్లి.
ఇక ఈ మధ్య దాకా కూడా ఆయన రాష్ట్రం విడిపోవడం అన్నది పూర్తిగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని వాదిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ తలుపులు వేసేసి టీవీలు బంద్ చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. సరైన ప్రోసీజర్ లో రాష్ట్రాన్ని విడగొట్టలేదని కూడా ఉండవల్లి ఈ రోజుకీ ఆరోపిస్తూనే ఉన్నారు. దీని మీద ఆయన వేసిన కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది.
ఇక తెలంగాణా ఏపీ ఆస్తులను ఇవ్వడంలేదని, కేంద్రం ఇప్పించడంలేదని, ఏపీ సర్కార్ ఈ విషయంలో నోరు మెదపడంలెదని కూడా ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 9, 10 షెడ్యూల్స్ లో ఉన్న ఏపీ ఆస్తుల విలువ ఆరున్నర వేల కోట్ల రూపాయల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని కూడా అన్నది ఉండవల్లే. మరి వీటికి కారణం కేసీయార్ కాదా అని ఉండవల్లి ఎందుకు అనుకోవడంలేదు అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఇక కేసీయార్ 2018 దాకా బీజేపీతో కలసికట్టుగానే ఉన్నారు. బీజేపీతో సానుకూలంగా ఉంటూ ముందస్తు ఎన్నికలను తెచ్చుకుని గెలిచారు. 2019 ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని ఉత్సాహపడి తిరిగారు. ఆ తరువాత బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాకవడంతో ఆయన తగ్గారు. తిరిగి దుబ్బాక హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల తరువాత నుంచి బీజేపీ మీద దాడి చేస్తున్నారు. ఇది కదా అసలు విషయం కానీ కేసీయార్ వీర బీజేపీ వ్యతిరేకిగా ఉండవల్లికి ఎలా కనిపించారో అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఆయనతో పోలిస్తే మమతా బెనర్జీ వంటి వారు చాలా కాలంగానే మోడీని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ అయితే తుదికంటా బీజేపీని వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకించే వారు దేశంలో ఎంతో మంది ఉన్నారు. వారెవరూ ఎప్పటికపుడు కప్పదాట్లు వేసుకుంటూ పోలేదు. మరి కేసీయార్ చిత్తశుద్ధిని ఎలా ఉండవల్లి నమ్ముతున్నారో అర్ధం కాలేదు అన్న వారూ ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఉండవల్లిని ఊసరవెల్లిగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభివర్ణించారు. ఆయన రాజకీయాలలో లేనని చెబుతూ మళ్లీ ఇలా పిల్లిమొగ్గలు వేయడమేమిటి అని ప్రశ్నించారు. బీజేపీని తిట్టడమే ఉండవల్లి పని అని కూడా అన్నారు. ఉండవల్లికి రాజకీయాలు చేయాలీ అని ఉంటే ముందు తనకు రాజకీయంగా ఎదుగుదలను ఇచ్చిన కాంగ్రెస్ ని ఉద్ధరించాలని ఆయన సూచిస్తున్నారు. మొత్తానికి వీర సమైక్యవాది ఉండవల్లికి ఏమైంది, కేసీయార్ తో దోస్తీ ఏమిటి అన్నదే ప్రశ్న. ఏపీ గురించి తెగ కన్నీరు కార్చే ఉండవల్లికి అంతకంటే బీజేపీ వ్యతిరేకతే ఎక్కువ అయిందా లేక కేసీయార్ లో సమైక్యతావాది రాత్రికి రాత్రి కనిపించారా అన్న ప్రశ్నలకు ఈ మాజీ ఎంపీ ఏమి జవాబు చెబుతారో.