Begin typing your search above and press return to search.

మీడియాను ఎందుకాపావో చెప్పు బాబు

By:  Tupaki Desk   |   7 Jun 2017 3:05 PM GMT
మీడియాను ఎందుకాపావో చెప్పు బాబు
X
పాయింటు ఉంటే గాని ఉండ‌వ‌ల్లి బ‌య‌ట‌కు రారు. సూటిగా మాట్లాడే నేత‌ల్లో ఒక‌రైన ఈ మాజీ కాంగ్రెస్ లీడ‌ర్ ఈ మ‌ధ్య పెద్ద‌గా మీడియాలో క‌న‌ప‌డ‌టం లేదు. తాజాగా అమ‌రావ‌తి స‌చివాల‌యం లీకేజీ వ్య‌వ‌హారంపై స్పందించారు. చంద్ర‌బాబు స‌ర్కారు అస‌మ‌ర్థ‌త‌, అవినీతిపై ఆయ‌న ఈ సంద‌ర్భంగా విరుచుకుప‌డ్డారు.

అస‌లు అంత కొత్త బిల్డింగు కార‌డం వివాదాస్ప‌దం అయితే క‌వ‌ర్ చేయ‌డానికి వెళ్లిన మీడియాను అనుమ‌తించ‌క‌పోవ‌డంలో ఉద్దేశం ఏంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. మీడియాను అడ్డుకోవ‌డం దారుణం అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌పై తాను గెల‌వ‌డానికి చూస్తుంటార‌ని, ఎందుకంటే అత‌నిలో ఆత్మ‌న్యూన‌తాభావం ఎక్కువ‌ని అన్నారు. తన‌దెక్క‌డ పై చేయి కాకుండా పోతుందో అని బెంగ అన్నారు. టీడీపీలో సీనియ‌ర్ సీనియ‌ర్ అని చెప్పుకునే ఆయ‌న కంటే బుచ్చ‌య్య చౌద‌రి చాలా సీనియ‌ర్ అన్నారు. చంద్ర‌బాబు ఆలోచ‌నా విధానం, ఆత్మ‌న్యూన‌త రాష్ట్రానికి ప్ర‌మాద‌క‌రమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీలు ఏం చేశార‌ని విమ‌ర్శించే చంద్ర‌బాబు ఆయ‌న ఎంపీలు కూడా పార్ల‌మెంటులో ఆ స‌మ‌యంలో ఏం చేశారో చెప్పాల‌న్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం ఆంధ్రాకు వ‌స్తే నిర‌స‌న వ్య‌క్తం చేయ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను కోర‌డం, తెలుగుదేశం నేత‌ల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేయించ‌డం ప్ర‌జాస్వామ్య‌మా? అని నిల‌దీశారు.

ఏ కార‌ణం వ‌ల్ల తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్తు బ‌కాయిల‌ను వ‌సూలు చేయ‌కుండా నోర్మూసుకుని ఉన్నార‌ని ఆయ‌న అడిగారు. ఓటు కు నోటే మీ మౌనానికి కార‌ణ‌మా? అని ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/