Begin typing your search above and press return to search.

నేనా... వైసీపీలోకా? నో ఛాన్స్

By:  Tupaki Desk   |   7 May 2019 4:08 PM GMT
నేనా... వైసీపీలోకా? నో ఛాన్స్
X
మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యింది. అసలే వాగ్దాటి ఉన్న నాయకుడు. సమాధానం చెప్పుకుండా ఉండడు కదా... తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఉండవల్లి ఏం చెప్పినా కన్ ఫంగా చెబుతుంటారు. అనుమానాలు వచ్చేలాగా చెప్పరు. ఈ ప్రశ్నకు కూడా అలాగే చెప్పారాయన.

ఇంతకీ ఆయనకు మీడియా నుంచి ఎదురైన ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే... మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారట కదా. నిజమేనా ? అని అడిగారు. దానికి అంతే ఆసక్తికరంగా ఆయన జవాబు ఇచ్చారు.

అవకాశమే లేదండీ. ఆయన నా అవసరం ఆ పార్టీకి లేదు. అందులో నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. నాకంటే మంచి సలహాలు ఇవ్వగలిగిన వారు ఆ పార్టీలో ఉన్నారు. వారికి నాతో ఏం పనిలేదు. నేను కొత్తగా వారికి చెప్పాల్సిన సూత్రాలు కూడా ఏం లేవు. ఆ పార్టీకి ఇప్పటికే చాలా అనుభవం వచ్చేసింది. ఇంకా ఉండవల్లి వెళ్లి చేసేదేం లేదక్కడ అన్నారు. అయినా ఇదంతా పక్కన పెడితే నేను రాజకీయాల్లోంచి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాను. ఇపుడు నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కూాడా ఏం లేదన్నారు.

ఏదేమైనా ఉండవల్లి తనకు సంబంధించిన వచ్చిన అనుమానాలకు ఎపుడు కావాలంటే అపుడు బ్రేకులు వేస్తుంటారు. ఆయన చెబితే జనం కన్విన్స్ కావాల్సిందే అన్నట్లు ఉంటుంది. ఉదాహరణ కు ఈరోజు పోలవరం మీద ఆయన చెప్పిన ఒక మాట తీసుకుందాం

‘‘నాకు పోలవరం మీద అనుమానాలున్నాయి. అక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి. వాటిని చంద్రబాబు సరిచేసి ఉండాల్సింది. నేను మాట్లాడిందాంట్లో ఏమైనా తప్పుంటే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెబుతాను. నా అనుమానాలు నివృత్తి చేయండి’’ అన్నాడు ఉండవల్లి. ఇలా ఇపుడు కనుక చంద్రబాబు స్పందించకపోతే తను చెప్పిందే నిజమని జనం కన్ఫమ్ చేసుకుంటారు. మరి బాబు సైలెంటవుతారా? లేద జవాబిస్తారా? అన్నది చూాడాలి. ఇలా కన్విన్సింగ్ గా మాట్లాడటంలో ఉండవల్లి దిట్ట.