Begin typing your search above and press return to search.

బాబు చక్రంపై ఉండవల్లికి బోలెడు నమ్మకం

By:  Tupaki Desk   |   7 May 2019 12:17 PM GMT
బాబు చక్రంపై ఉండవల్లికి బోలెడు నమ్మకం
X
ఒక రకమైన గోదారి యాసలో అందరికీ అర్థమయ్యే తెలుగులో స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగలిగిన ఉండవల్లి... ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆసక్తికరంగా మాట్లాడుతుంటారు.

ఈరోజు అనేక విషయాలపై మాట్లాడిన ఆయన ప్రసంగం చంద్రబాబు చుట్టే తిరిగింది. ఒక దశలో చంద్రబాబు ను తిడుతున్నాడో - పొగుడుతున్నాడో భరోసా ఇస్తున్నాడో అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే చివరకు క్లారిటీ ఇచ్చాడు. ఆయన చెప్పిన విషయాలను పాయింట్ టు పాయింట్ మాట్లాడకుంటే మీకు క్లారిటీ ఉంటుంది.

ఎన్నికల్లో బాబు ఓటమి

అసలు తెలుగుదేశం ఓడిపోతే ఏం జరుగుతంది? అని ప్రశ్నించిన ఉండవల్లి సమాధానమూ తానే చెప్పారు. మీరు ఓడిపోయినా..మీ పార్టీ జనంలో ఉంటుంది. మీరు ఆందోళన ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇపుడు ఓడినా మీ కొడుకు ఉన్నాడు. పార్టీకేమీ కాదు. వచ్చే సారి అధికారంలోకి వస్తుందన్నారు. లాస్ట్ టైం మీరు ఈవీఎంలతోనే గెలిచారు గుర్తుపెట్టుకోండి.

కేంద్రంలో బాబు చక్రం

ఉండవల్లి మాటల్లో మిగతా అన్ని విషయాలు బాబును బాధ పెట్టిన ఆయన రాజకీయం గురించి భరోసాగా ఉండమన్నట్లు మాట్లాడారు. మన వద్ద 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. మీకు పది వచ్చినా చాలు. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం వస్తే పాత పరిచయాలతో చక్రం తిప్పుతారు. ఎన్డీఏ - యూపీఏకు మెజార్టీ రాక‌పోతే ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. అపుడు మీ హిస్టరీ మీకు ఉపయోగపడుతుందన్నారు.

బాబు ప్రవర్తనపై సెటైర్లు

చంద్రబాబు ఇరిటేషన్ తగ్గించుకోవాలి. అనవసరమైన ఆందోళన ఎందుకు ? పదేపదే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్సార్‌ ఉన్న సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నేతలను చాలా ఇబ్బంది పెట్టింది. ఇదంతా మామూలే. ఓటమి ఖాయమైనపుడు సీఎస్ తో గొడవ ఎందుకు? నాకైతే అర్థం కాలేదు. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారికి బిల్లులు మంజూరు చేయాలని కోరగా... ఆ కోరిక నెరవేర్చనందుకు కచ్చిగట్టినట్టు చెబుతున్నారు. అందుకే ఎల్వీపై ఆరోపణలు చేస్తున్నారని ఉండ‌వ‌ల్లి చెప్పుకొచ్చారు. పోలింగ్ సమయంలోనూ ఎన్నిక‌ల్లో ఓటేశాక ఏ ముఖ్యమంత్రి అయినా నా ఓటు నాకే పడిందో లేదో తెలియదని చెప్పడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే అలా అనడం కరెక్టు కాదు అన్నారు.

పోలవరం

కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం జనానికి చూపించారు. అరె నాకు వచ్చిన డౌట్లు పదే పదే అడిగినా ఎవరూ ఆన్సర్ చెప్పడం లేదు. నా అనుమానాలను పట్టించుకోవడం లేదు. ఎన్నికలు అయిపోయాకయినా నిజాలు చెప్పాలి కదా. అంతా పబ్లిసిటీ స్టంటేనా? కాఫర్‌ డ్యామ్‌ - పట్టిసీమ పేరుతోనూ పబ్లిసిటీ ఊపేశారు. కానీ ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి ప్రజలకు నిజాలు చెప్పడం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టులో హడావుడి ఎక్కువ. నాణ్యత తక్కువ. పోలవరం ప్రాజెక్టు చాలా పెద్దది. దానిని జాగ్రత్తగా నిర్మించాలి. అశ్రద్ధ వల్ల ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోతోందంటున్నారు. ఇలాగే చేస్తే... ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే రాజమండ్రి ప్రాంతం ఆ ప్రమాదంలో కొట్టుకుపోతుందన్నారు.