Begin typing your search above and press return to search.

ఉండ‌వ‌ల్లి సైలెంట్‌.. తేల్చేకోలేక పోతున్నారా...?

By:  Tupaki Desk   |   1 Oct 2021 6:30 AM GMT
ఉండ‌వ‌ల్లి సైలెంట్‌..  తేల్చేకోలేక పోతున్నారా...?
X
రాజ‌కీయ విశ్లేష‌కులు, రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఎక్క‌డ‌? ఆయ‌న అడ్ర‌స్ క‌నిపించ డం లేదే! ఇదీ.. రాజ‌కీయ నేత‌ల ఆలోచ‌న‌.మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆయ‌న కోసం గాలిస్తోంది! విచిత్రంగా ఉన్న‌ప్ప‌టికీ ఇది నిజం. త‌ర‌చుగా రాష్ట్ర రాజ‌కీయాలపై ఆయ‌న గ‌ళం వినిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే కొన్ని సూచ‌న‌లు కూడా చేస్తుంటారు. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా.. ప్ర‌ధాన మీడియా కూడా ఆయ‌నకు మంచి ఫాలోయింగ్ ఇస్తుంది. అయితే.. రాష్ట్రంలో గ‌డిచిన వారం రోజులుగా అనేక ప‌రిణామాలు చేసుకున్నాయి.

వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉండ‌వ‌ల్లి స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు మంత్రుల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. ద‌రిమిలా.. చంద్ర‌బాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడికి పాల్ప‌డ్డా ర‌నే టీడీపీ ఆరోప‌ణ‌లు.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉండ‌వ‌ల్లి నోరు విప్ప‌లేదు. అదేస‌మయంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు.. అధికార పార్టీ నేత‌ల‌కు మ‌ధ్య చోటు చేసుకున్న ర‌గ‌డ తీవ్ర స్థాయికి చేరింది. నువ్వా-నేనా అనుకునే ప‌రిస్థితి వ‌ర‌కు విష‌యం వ‌చ్చింది. మంత్రులు కూడా భారీ రేంజ్ లో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు.

ఇక‌, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రో అడుగు ముందుకు వేసి.. పూర్తిగా.. వైసీపీ జెండా క‌ప్పేసుకున్న నాయ‌కుడి గా మాట్లాడారు. ఇవ‌న్నీ.. రాజ‌కీయంగా పెద్ద కుదుపున‌కు కార‌ణంగా మారాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌క్క‌న పెట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ వీటిపైనే దృష్టి పెట్టారు. ఇక‌, ప్ర‌ధాన మీడియా కూడా వీటిపైనే వార్త‌లు రాసింది. అయితే.. రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఇంత వేడెక్కినా.. కూడా ఉండ‌వ‌ల్లి ఎక్క‌డా రియాక్ట్ కాక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం.

అయితే.. ఆది నుంచి కూడా జ‌గ‌న్ ను స‌మ‌ర్ధిస్తూనే విమ‌ర్శ‌లు చేసే ఉండ‌వ‌ల్లి.. ఇప్పుడుజ‌రిగిన వాటిలో ఆయ‌న త‌ప్పు లేద‌ని.. భావిస్తున్నారా? అదేస‌మ‌యంలో మంత్రుల‌పై నోరుపారేసుకున్న‌.. మాజీ మంత్రి అయ్య‌న్న‌, ఇటు ప‌వ‌న్‌ను స‌మ‌ర్ధించే ప‌రిస్థితిలేద‌ని మౌనంగా ఉన్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. చూడాలి మ‌రి ఆయ‌న ఎప్ప‌టికి స్పందిస్తారో.. ఏం చెబుతారో అంటున్నారు ప‌రిశీల‌కులు.