Begin typing your search above and press return to search.

బాబు అవినీతి బండారం బయటపెట్టిన ఉండవల్లి

By:  Tupaki Desk   |   9 Oct 2018 9:15 AM GMT
బాబు అవినీతి బండారం బయటపెట్టిన ఉండవల్లి
X
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబుపై మరో బాంబు పేల్చారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఒక కంపెనీతో రూ.16,600 కోట్ల రూపాయల ఎంవోయూ ఎందుకు చేసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సున్నా పెట్టుబడి అంటూనే 16600కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు.

మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఉండవల్లి... చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం పెద్ద కుంభకోణం అని బెంగళూరుకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ 45 పేజీల్లో ప్రచురించిన ఓ సంచలన కథనాన్ని మీడియాకు చూపించారు. జీరో బడ్జెట్ అంటూ 16600 కోట్లు కొట్టేస్తున్న వైనంపై సదురు ఎన్టీవో సంస్థ ఆశ్చర్యపోయిందని వివరించారు. ఈ ఒప్పందంపై సమాచార హక్కు చట్టం కింద తాను దరఖాస్తు చేసుకుంటే.. సెక్షన్ 8 ప్రకారం ఆర్టీఐ చట్టం ఈ అంశానికి వర్తించదని ఏపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని ఉండవల్లి సంచనల నిజాలను బయటపెట్టాడు. కేవలం దేశ రక్షణకు సంబంధించిన విషయాలు మాత్రమే బయటపెట్టరని.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8.. ఒప్పందానికి ఎలా వర్తిస్తుందని ఉండవల్లి ప్రశ్నించారు.

అసలు సున్నా పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం అంటూనే 16వేల 600 కోట్ల ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఉండవల్లి డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చి తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల వద్దకు వెళ్లానని.. వారిలో కొందరికీ మాత్రమే ఆవు పేడను, మురగబెట్టేందుకు డ్రమ్ములు ఇచ్చారని.. వాటి విలువ బయట మార్కెట్లో నాలుగు వందలు కూడా ఉండదని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం నాలుగువేలుగా చూపించిందని ఉండవల్లి నిజాలు బయటపెట్టారు.

తనది పారదర్శక పాలన అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలా జీరోబడ్జెట్ పేరుతో ఒక కంపెనీతో రూ.16600 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.