Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు ఉండ‌వ‌ల్లి కొన్ని హెచ్చ‌రిక‌లు.. ఇంకొన్ని జాగ్ర‌త్త‌లు.. భలే ఐడియా గురూ!

By:  Tupaki Desk   |   9 Oct 2021 4:30 PM GMT
జ‌గ‌న్‌కు ఉండ‌వ‌ల్లి కొన్ని హెచ్చ‌రిక‌లు.. ఇంకొన్ని జాగ్ర‌త్త‌లు.. భలే ఐడియా గురూ!
X
దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు ఉన్న అనుబంధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ కుటుంబంపై ఈగైనా వాల‌కుండా చూసుకునే వారిలో ఉండ‌వ‌ల్లి ముందు వ‌రుస‌లో ఉంటారు. గ‌తంలో జ‌రిగిన మేళ్ల‌ను ఆయ‌న ఇప్ప‌టికీ నెమ‌రు వేసుకుంటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో వైఎస్ కుమారుడు, సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై అప్పుడ‌ప్పుడు.. నిప్పులు చెరిగేసేలా మాట్లాడినా.. ఉండ‌వ‌ల్లి అంత‌రార్థం వేరే ఉంటుంద‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికి చాలాసార్లు.. మీడియామీటింగులు పెట్టి.. జ‌గ‌న్‌ను చెరిగేసిన ఉండ‌వ‌ల్లి.. ఆ చెరుగుడు మాటున‌.. అనే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేస్తూ ఉన్న విష‌యం తెలిసిందే.

తాజాగా కూడా మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చిన ఉండ‌వ‌ల్లి.. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నా రు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు.

ఇక్క‌డ ఉండ‌వ‌ల్లి వారి ఆవేద‌న ఏంటంటే.. గ‌త కొన్నాళ్లుగా.. ఏపీ సీఎం జ‌గ‌న్ అప్పుల ముఖ్య‌మంత్రి అనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని టీడీపీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. దీంతో జ‌గ‌న్ ఇమేజ్ ఒకింత దెబ్బ‌తినే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రానికి అనేక ఆర్థిక వ‌న‌రులు ఉన్నా.. ఆయ‌న వాటి జోలికి పోకుండా.. అభివృద్ధి నినాదంతో పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌కుండా.. ఉపాధి క‌ల్పించ‌కుండా.. రాష్ట్రాన్ని సీఎం అప్పుల కుప్ప‌గా మారుస్తున్నార‌నే వాద‌న ఉంది. దీనికి విరుగుడుగా.. ఉండ‌వ‌ల్లి.. పై స్టోరీ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం అప్పులో.. సీఎం జ‌గ‌న్ పాత్ర లేద‌ని.. అంతా స‌ల‌హాదారుల పాప‌మేన‌ని.. వారి వ‌ల్లే జ‌గ‌న్‌కు క‌ష్టాలు వ‌చ్చాయ‌ని.. వారు తిని ప‌డుకుంటున్నార‌ని.. అప్పుల్లో జ‌గ‌న్ పాపం ఏమీ లేద‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, 'వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం దీనికి ఒప్పుకుంది. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణం. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోంది. పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు' అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

ఇక్క‌డ కూడా జ‌గ‌న్‌ను ప‌క్కా ప్ర‌ణాళిక‌తో కాపాడేశారు.. ఉండ‌వ‌ల్లి. పోల‌వ‌రం పాపం మొత్తం.. బీజేపీదేన‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌దేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా కుమ్మేశారు. ఇటీవ‌ల కాలంలో పోల‌వ‌రం ముందుకు సాగ‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ తీసుకున్న రివ‌ర్స్ టెండ‌రింగ్‌విధాన‌మేన‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అంతేకాదు.. వ‌చ్చే ఖ‌రీఫ్‌కు కూడా నీరు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టంగా చెబుతోంది. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌పై ఎలాంటి మ‌ర‌క‌లు ప‌డ‌కుండా.. ఉండేందుకు.. ఈ పాపం మొత్తం.. కేంద్రానిదేనంటూ.. ఉండ‌వ‌ల్లి తాజా ప్రెస్ మీట్‌లో చెప్ప‌క‌నే చెప్పారు. జ‌గ‌న్‌ను అడ‌గ‌కుండానే, ఆయ‌న‌ను వెనుకేసుకు వ‌చ్చారు. దేశంలో ఏరాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెప్పిన‌ట్టు న‌డ‌వ‌డం లేద‌ని.. ఒక్క జ‌గ‌నే న‌డుస్తున్నార‌ని..అ యినా.. ఆయ‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే.. పోల‌వ‌రం ఆగిపోయింద‌ని.. ఇది ఎంత మాత్రం జ‌గ‌న్ త‌ప్పుకాద‌నేది ఉండ‌వ‌ల్లి తేల్చేసిన కీల‌క విష‌యం. సో.. మొత్తంగా.. ఉండ‌వ‌ల్లి.. పైకి తిడుతూనే.. మ‌న‌సులో మాత్రం జ‌గ‌న్‌పై మ‌ర‌క‌లు ప‌డ‌కుండా.. చాలా జాగ్ర‌త్త‌గా మేనేజ్ చేసుకుంటూ.. వ‌చ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.