Begin typing your search above and press return to search.
ఉండవిల్లి రంగంలో దిగితే.. బాబుకు చుక్కలే!
By: Tupaki Desk | 29 Aug 2016 5:30 PM GMTరాజకీయాల్లో రెండు రకాల నాయకులుంటారు. కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలను నడిపిస్తూ, అన్ని రకాల వ్యూహాల్తో ప్రత్యర్థుల్ని దెబ్బతీయడమూ, తాము నెగ్గడమూ చేయగల సమర్థులు ఒకటో రకం - మేధావులుగా చెలామణీ అవుతూ పార్టీ విధానాల పరంగా పార్టీకి ప్రజల్లో గౌరవం దక్కేలా వ్యవహరిస్తూ - రాకీయ ప్రత్యర్థుల్ని తమ సూటి విమర్శలతో ఆటాడుకోగల వారు రెండో రకం. ఈ రెండో రకం వారు ప్రజల్లో ఉండరు, వారికేమీ ఎన్నికల్లో గెలిచేంత వ్యక్తిగత జనాదరణ ఉండదు. కానీ వారు విమర్శలు పూనుకుంటే మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సుబ్రమణ్యస్వామిలాగా.. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి క్రెడిబిలిటీ ఉండవిల్లి అరుణ్ కుమార్ కు ఉంది. ప్రస్తుతం రాజకీయం స్తబ్దుగా ఉన్న ఆయన వైకాపాలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. బాబుకు చుక్కలు కనిపించడం ప్రారంభం అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఉండవిల్లి అరుణ్ కుమార్ కు మేధావి నాయకుడుగానే గుర్తింపు ఉంది. కాకపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనను బాగా ఎంకరేజ్ చేశారు. వైఎస్ హవాలో ఎన్నికలు గెలిచిన సందర్భాల్లో ఎంపీని కూడా చేశారు. నేరుగా తనకు అంత ప్రజాబలం లేకపోయినా.. వైఎస్ పుణ్యమాని ఉండవిల్లి నెగ్గారు. ఉండవిల్లి తన లీగల్ ఫైట్‌తో అప్పట్లో వైఎస్ ఆర్ తో వైరం పెట్టుకున్న ఈనాడు రామోజీరావును ఇబ్బంది పెట్టారు. అయితే వైఎస్ మరణానంతర పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయినా, సమైక్యాంధ్ర పోరాటం సమయంలో మాత్రం గట్టిగా పోరాడారు. ఆయన వాదన పటిమను అందరూ గుర్తించారు. కానీ ఫలం దక్కలేదు.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఆయన రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. వైకాపాలో కాస్త విశ్లేషణాత్మకంగా శత్రువును చీల్చిచెండాడగల నాయకుల సంఖ్య పెరుగుతుంది. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి ఇటీవలే భ్రమరావతి అనే పుస్తకాన్ని కూడా తెచ్చిన ఉండవిల్లి, వైకాపాలోకి వస్తే గనుక.. చంద్రబాబుకు.. ఖచ్చితంగా నిద్రలేని రాత్రులు ప్రసాదిస్తారని పలువురు అనుకుంటున్నారు.