Begin typing your search above and press return to search.

వైఎస్ తోనే కన్నీళ్లు పెట్టించిన ఉండవల్లి ‘కథ’

By:  Tupaki Desk   |   13 May 2019 4:56 AM GMT
వైఎస్ తోనే కన్నీళ్లు పెట్టించిన ఉండవల్లి ‘కథ’
X
ఉండవల్లి అరుణ్ కుమార్.. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. ఈయనను రాజమండ్రి ఎంపీగా పోటీచేయించి గెలిపించింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తనకు వైఎస్ గాడ్ ఫాదర్ అని ఉండవల్లి ఎప్పుడూ చెబుతుంటారు. కేవీపీ, వైఎస్ కు అప్పట్లో ఎంతో ఆప్తుడుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా వైఎస్ పై సంచలన పుస్తకాన్ని రాశారు. ఎమ్మెస్కే నేతృత్వంలో విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ఈనెల 14న హైదరాబాద్ దసపల్లాలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించనున్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

వైఎస్ కు ఉండే నమ్మకాలు.. తనను నమ్ముకున్న వారిపట్ల ఆయన చూపించే ప్రేమ, అప్యాయత వారికోసం చేసిన సాహసాలు.. ఢిల్లీలో వైఎస్ కోపంతో సూట్ కేసు బయటపెట్టి ఖాళీ చేయించిన సంఘటన.. చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనానికి దారితీసిన నేపథ్యం.. మార్గదర్శి చిట్ ఫండ్ పై ఉండవల్లి పోరాటం.. వైఎస్ కు ఘోస్ట్ రైటర్ గా తెరవెనుక ఉండవల్లి రచనావ్యాసంగం ఇలా అన్ని అంశాలను తెరవెనుక ఏం జరిగిందనేది అరుణ్ కుమార్ పూసగుచ్చినట్టు వివరించారు.

అయితే వైఎస్ ను ఓ సందర్భంలో ఉండవల్లి ఏడిపించాడట.. ఓ లంచ్ టైంలో ఇద్దరు భోజనం చేస్తుండగా ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఉన్నప్పుడు ఉండవల్లి చెప్పిన కథ వైఎస్ ను కన్నీల్లు పెట్టించిందట.. ఆ కథ ఏంటనేది మాత్రం రిలీవ్ చేయలేదు. ఇక వైఎస్ ను అధికారంలో నిలబెట్టి సంక్షేమ పథకాలపై కూడా ఇందులో రాశారు. జగన్ ఆరోపణలు.. వైఎస్ ఏం నిర్ణయాలు తీసుకున్నారు. ? మహానాయకుడిగా వైఎస్ ఎలా ఎదిగారన్నది ఈ పుస్తకంలో పొందుపరిచాడట.. సో ఈ పుస్తకం విడుదలయ్యాక వైఎస్ ఆత్మకథ బయటపడినట్టే. అందుకే దీనిపై ఆసక్తి నెలకొంది.