Begin typing your search above and press return to search.

జగన్ అందుకోసం అప్పు చేస్తున్నాడు.. అది కరెక్ట్ కాదు..: 'ఉండవల్లి' హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   7 Feb 2022 7:30 AM GMT
జగన్ అందుకోసం అప్పు చేస్తున్నాడు.. అది కరెక్ట్ కాదు..: ఉండవల్లి హాట్ కామెంట్స్
X
గోదావరి లో పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్లు.. ఇప్పుడున్న ప్రభుత్వంలో పాత వ్యక్తులు పోయి కొత్త వ్యక్తులు వచ్చారు.. అది అలాగే జరుగుతూ ఉంటుంది’ అని ఉమ్మడి ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈయన సోనియా ప్రసంగానికి ట్రాన్స్ లేటర్ గా వ్యవహరించేవారు. వైఎస్ఆర్ కు ఆప్త మిత్రుడిగా ఉన్న ఉండవల్లి అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటున్నారు. అయితే ఒక్కోసారి జగన్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పటి ప్రత్యేక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా బిజినెస్ మ్యాన్. వ్యాపార లెక్కలో దిట్ట. ఈ విషయంలో ఆయనను మించిన వారు లేరు. రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ప్రతీ ఒక్కటీ ఆయనకు తెలిసే ఉంటుంది. అతని స్టాటజీ ఎప్పుడూ సక్సెస్ ఫుల్ గానే ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత రావడం కామన్. ఈ పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం పెద్ద విషయమేమి కాదు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎలా యాక్టివ్ గా ఉంటారనేదే వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది.’

‘జగన్మోహన్ రెడ్డి పాలన నాకు అస్సలు నచ్చలేదు. అయితే ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. అయితే జగన్ ప్రవేశపెడుతున్న ఉచిత పథకాలు ఆయన కొంప ముంచుతాయా..? అనేది తేలాల్సి ఉంది. ఆయన రెండేళ్లలో చేసిన పనులు నాకేమాత్రం నచ్చలేదు. కరోనా వైరస్ జగన్ పాలనకు ప్రయోజనకరంగా మారింది. ఎందుకంటే ఆ సమయంలో కూడా పింఛన్లు, ఇతర పథకాలను ఆపలేదు. అలాంటి సమయంలో పథకాలు ప్రజలకు అందడం మంచిదే. అందువల్ల జగన్ పాపులారిటీ ఇంకా తగ్గలేదు’

‘మనకు ఏదీ ఉచితంగా రాదు. కొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నారంటే మిగతావారి నుంచి వాటిని లాగేసుకున్నవే..అయితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడనేది నాకు తెలిసిపోయింది. కానీ అది పద్దతి కాదు. అప్పుల ద్వారా కావచ్చు.. ఆస్తులు అమ్మి కావచ్చు.. డబ్బు తెస్తున్నాడు. కానీ ప్రయోజకరమైన అప్పులు చేయడం లాభం.. కానీ నిష్ప్రయోజనాల అప్పులు నష్టం.. ఇప్పుడు జగన్ రెవెన్యూ వ్యయానికి అప్పు చేస్తున్నాడు. అది ఎన్నటికైనా నష్టమే..’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.