Begin typing your search above and press return to search.

ఉండవల్లి సీరియస్ క్వశ్చన్: పండోరాను ఖండించినప్పుడు అప్పుల మీద అలా చేయరే?

By:  Tupaki Desk   |   10 Oct 2021 3:43 AM GMT
ఉండవల్లి సీరియస్ క్వశ్చన్: పండోరాను ఖండించినప్పుడు అప్పుల మీద అలా చేయరే?
X
సూటిగా.. సుత్తి లేకుండా తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. దివంగత మహానేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అలాంటి ఉండవల్లి.. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం సరికాదని ఆయన వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పుల మీద ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1956 తర్వాత ఇంత దయనీయమైన పరిస్థితి ఎప్పుడూ లేదన్న ఆవేదనన వ్యక్తం చేసిన ఆయన.. గ్యాంబ్లింగ్ విధానం రాష్ట్రంలో నడుస్తోందన్నారు.

అనేకమంది ఐఏఎస్ లు.. ఐఆర్ఎస్ లు.. ఆర్థిక నిపుణులు.. సుమారుగా 200లకు పైనే సలహాదారులు ఉన్నారని.. అయినా ఏం జరుగుతోందని ప్రశ్నించిన ఉండవల్లి.. ఇవాళ కేంద్రంష్యూరిటీ ఇస్తేనే అప్పు. అంతేకాదు.. పది శాతం విలువ తాకట్టు పెట్టాలని.. విశాఖలోని సంస్థలన్నీ తాకట్టు పెట్టేశారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో మరిన్ని కీలకమైన అంశాల్ని చూస్తే..

- ఉచిత కరెంట్‌కు మీటర్లు పెట్టి, మున్సిపాల్టీలు చెత్త పన్ను లు వేస్తామని ఒప్పుకొంటేనే అప్పులు ఇస్తున్నా రు. ఈ షరతులను బీజేపీ రాష్ర్టాలు కూడా ఒప్పుకోలేదు. కేవలం ఏపీ మాత్రమే ఒప్పుకుం ది. మన రాష్ర్టానికి ఉన్న లిమిట్‌ దాటి రూ.45 వేల కోట్లు అప్పు తెచ్చారు. దీనికి 7శాతం వడ్డీ కట్టాలి. రూ.6 లక్షల కోట్లకు రూ.42 వేల కోట్లు ప్రతి ఏటా వడ్డీ కట్టాలి. ఈ అప్పు తీర్చాలంటే మళ్లీ పన్నులు వేయాలి.

- అసలు వీళ్ల ఆలోచన ఏంటి? మొత్తం ఆస్తులు అమ్మేస్తున్నారని, అప్పులు పాలైపోతున్నామని ‘ఆంధ్రజ్యోతి’ వంటి పేపర్లు కావాలని రాశారేమోనని, జగన్‌ పేపరు చూస్తే కనీసం ఖండన కూడా ఉండ దు. పండోరా పేపర్లో జగన్‌ పాత్ర ఉందని చంద్రబాబు అంటే మాత్రం ఖండించారు. అం టే పేపరులో అబద్ధం రాస్తే ఖండిస్తారు. కానీ అప్పుల గురించి ఎందుకు ఖండించడం లేదు. ఎందుకంటే ఇది నిజం కాబట్టి!

- రాష్ట్రం ఎక్స్‌ట్రా అకౌంట్‌ కేంద్రానికి పెట్టిందని ఇటీవల నిపుణులతో మాట్లాడితే తెలిసింది. ఒక చిరుద్యోగి ఓ స్కూటర్‌ బ్యాంక్‌ ద్వారా కొంటే, అతని జీతంలోనే ఈఎంఐ కట్‌ చేసుకొనే హక్కు బ్యాంక్‌కు ఇవ్వడం వంటిది ఇది. అంటే ముందుగానే అప్పు మినహాయించుకోవడం అన్నమాట! అప్పులన్నీ క్లియర్‌ చేస్తానని జగన్‌ చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. మద్యం అమ్మిన ఆదాయం అంతా అప్పుకే కట్టాలి. లేకపోతే ఆస్తులన్నీ జప్తు చేసుకుంటారు.

- ఈ అప్పుల బాండ్‌పై గవర్నర్‌ హరిచందన్‌ పేరు రాశారు. ఒకవేళ కట్టకపోతే గవర్నర్‌ హరిచందన్‌ పేరు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎక్కడ బడితే అక్కడ అప్పు లు తెస్తే రాష్ర్టానికి దెబ్బ. ఇంకా అప్పుల కోసం వెతుకుతున్నారేకానీ దీని నుంచి బయటపడే పరిస్థితిని చూడటం లేదు. జీతాలు, పెన్షన్లకు రూ.20 వేల కోట్లు బాకీ ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.

- మామూలు జనానికి డబ్బులు ఇస్తే చాలనుకోవడం పొరపాటు. భరోసాలు, ఎక్స్‌గ్రేషియాలు ఏమీ పనికిరావు. నీళ్లు, నూనెతో తినేవాడు, నెయ్యితో కూడా తినాలనుకుంటాడు. ఇవాళ వర్కులు లేవు. పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ రావడం లేదు. పారిపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో జగన్‌కు 100మందికి పైగా క్లాస్‌-1 కాంట్రాక్టర్లు ఉన్నారు. కాని ఎవరూ రాలేని పరిస్థితి. పోలవరం పనులు మేఘా కృష్ణారెడ్డి చేస్తున్నారంటే... ఆయనకు కేంద్రంతో కూడా పరిచయాలు ఉండటం వల్లే సాధ్యమవుతోంది.