Begin typing your search above and press return to search.

అండర్ 19 వరల్డ్ కప్: ఆంధ్రాను గర్వించేలా చేసిన గుంటూరు క్రికెటర్?

By:  Tupaki Desk   |   8 Feb 2022 4:30 AM GMT
అండర్ 19 వరల్డ్ కప్: ఆంధ్రాను గర్వించేలా చేసిన గుంటూరు క్రికెటర్?
X
ఇంగ్లండ్‌ను ఓడించి అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది యంగ్ టీమిండియా. అద్భుత విజయానికి సహకరించిన ఆటగాళ్లను ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌ గెలవడానికి కీలకమైన 50 పరుగులు చేసిన జట్టులో క్రికెటర్ గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కూడా ఒకరు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లోనూ రషీద్ 94 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నమోదు చేశాడు.

రషీద్‌కు అతని కుటుంబ సభ్యుల నుంచి గొప్ప మద్దతు లభించింది. చిన్నపాటి ఉద్యోగాలు చేసే అతని తండ్రి బలీషా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ రషీద్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాడు.

రషీద్‌కి ఆరేళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి అతనిలో క్రికెట్ నైపుణ్యాలను గుర్తించాడు. మొదట్లో హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత రషీద్ మంగళగిరిలోని ఏసీఏ కోచింగ్ అకాడమీకి ఎంపికయ్యాడు. రషీద్ కోచింగ్‌కు మద్దతుగా అతని కుటుంబం మొత్తం మంగళగిరికి మారింది.

అండర్-19 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత, రషీద్ తండ్రి విజయంలో కొడుకు పాత్రపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘'భారత్‌ ప్రపంచకప్‌ విజయంలో మా కొడుకు కీలకపాత్ర పోషించినందుకు గర్వపడుతున్నాం. అతని నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభమైంది. అతను ఏదో ఒక రోజు భారత సీనియర్ జట్టుకు ఆడతాడని నాకు నమ్మకం ఉంది, ”అని బలీషా తెలిపాడు.

ప్రపంచకప్‌లో భారత్‌ విజయం సాధించడంలో సహకరించిన రషీద్‌కు ఏసీఏ రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.