Begin typing your search above and press return to search.
మోడీ బడ్జెట్ అంత బోగస్..వెలుగులోకి సంచలన నివేదిక
By: Tupaki Desk | 23 Jan 2019 8:58 AM GMTఓ వైపు ఆకర్షణీయ బడ్జెట్ రూపొందించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ఎత్తుగడతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఉండగా....మరోవైపు అదే బడ్జెట్ కేంద్రంగా మోడీ సర్కారు కలవర పాటుకు గురయ్యే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూలేని ఓ ఆరు మార్గాల్లో తమ వ్యయాన్ని దాచిపెడుతున్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. ఈ నెలారంభంలో పార్లమెంట్ కు సమర్పించిన ఓ నివేదికలో చాలా ప్రభుత్వ రాయితీల ఖర్చుపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్ లో చాలా చాలా తక్కువ చేసి చెబుతున్నట్లు వెల్లడించింది.
కాగ్ తెలిపిన వివరాల ప్రకారం - దేశ జీడీపీలో ద్రవ్యలోటును గత ఆర్థిక సంవత్సరం (2017-18) 3.5 శాతానికి అదుపు చేసిన మోడీ సర్కారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) 3.3 శాతానికే కట్టడి చేయాలని నిర్దేశించుకున్న సంగతి విదితమే. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. దీంతో తొలి ఎనిమిది నెలల్లోనే లక్ష్యాన్ని దాటి ద్రవ్యలోటు నమోదవగా - నిధుల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. కాగ్ నివేదిక దీన్నే ప్రతిబింబించగా - ప్రభుత్వ అపరిమిత వ్యయంపట్ల హెచ్చరికలు చేస్తోంది. రైతులకు ఎరువుల సబ్సిడీ - విద్యుత్ - రైల్వేల్లో పెట్టుబడులు తదితర అంశాలు పారదర్శకంగా ఉండటం లేదని సూచించింది. బడ్జెట్ లో చెబుతున్నదానికి - చేస్తున్నదానికి సంబంధం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో మరిన్ని గారడీ అంకెలు ఉండనున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయంటూ కాగ్ మండిపడింది. ప్రధానంగా చిన్న మొత్తాల పొదుపు పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. దేశంలోని పేద - మధ్యతరగతి ప్రజలు పోగేసుకుంటున్న కష్టార్జితాన్ని.. బాధ్యతాయుతమైన పెట్టుబడులతో పదింతలు చేయాల్సిందిపోయి దివాలా అంచున ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను రక్షించడానికి వెచ్చిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఆర్థిక సాయం చేస్తోంని, దీనివల్ల ఏం లాభమని నిలదీసింది. అంతేగాక ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉన్న సంస్థలను.. నష్టాల్లో ఉన్న సంస్థలతో విలీనం చేస్తున్నదంటూ పవర్ ఫైనాన్స్ కార్ప్ - రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ల కలయిక వ్యవహారాన్ని ఉదహరించింది. ఖజానాను నింపేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో అనవసరపు పెట్టుబడుల ఉపసంహరణలు చేస్తున్నారంటూ విమర్శించింది.
ఇదిలాఉండగా - కాగ్ తోపాటు మరికొన్ని ఆర్థిక సంస్థలూ ప్రభుత్వ వ్యయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్ ఎస్ బీసీ - బ్లూంబర్గ్ ఎల్ పీ వంటి అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషణాత్మక దిగ్గజాలు వీటిలో ఉండటం విశేషం. 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో ప్రభుత్వ అప్పులు పెరిగినట్లు తెలుస్తున్నదని - ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయని వివరించాయి. ఆదాయం తక్కువగా ఉన్న వేళ వ్యయం పెరిగితే ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు. ఈసారి ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతినడం ఖాయమన్న అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అవసరాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి - మరికొన్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మధ్యంతర డివిడెండ్లను మోడీ సర్కారు కోరుతున్న విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు - వస్తు - సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్ణయాలూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టగా - జీఎస్టీ పన్నుల తగ్గింపూ నెలసరి వసూళ్లను బక్కచిక్కేలా చేస్తున్న సంగతి తెలిసిందే.