Begin typing your search above and press return to search.
జగనన్న పాలనలో... 13 నుంచి 6వ ర్యాంకుకు రాష్ట్రం.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 8 April 2022 11:30 PM GMTరాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాను.. అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాను.. అని సీఎం జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు లోటు లేదు.. ప్రతిపక్షాలు రాద్ధాం చేస్తున్నాయి.. అని కూడా అంటున్నారు. దీనికి తార్కాణంగా.. పోలీసులకు వస్తున్న మెడల్స్‌ను చూపిస్తున్నారు. అయితే.. తాజాగా.. దేశంలో నేరాలు.. హత్యులు జరుగుతున్న రాష్ట్రాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. దీనిలో 13 వస్థానంలో ఉన్న మనరాష్ట్రం... ఇప్పుడు మరింత దిగజారి.. 6వ స్థానానికి వచ్చింది. మరి.. దీనిని బట్టి..రాష్ట్రంలో ఏ విషయంలో అభివృద్ధి జరుగుతోందో.. జగనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
విషయం ఇదీ..
ఆంధ్రప్రదేశ్లో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట వరకూ అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ.. ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది. 2019లో రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 278.6 నేరాలు నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 452.7కు పెరిగింది.
ఏడాది వ్యవధిలోనే నేరాల రేటు ఏకంగా 162.49 శాతం పెరిగింది. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న నేరాల తీవ్రతకు గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2016 నుంచి 2019 వరకూ ఏపీలో నేరాల రేటు 250.1 నుంచి 283.9 మధ్యే ఉంది. కానీ 2020లో 452.7కు చేరింది. ఈ స్థాయిలో నేరాల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి.
తాజాగా కేంద్ర హోంశాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల్ని విశ్లేషిస్తే అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో గతంలో 11-13వ స్థానాల్లో ఉన్న ఏపీ 2020లో ఆరో స్థానానికి ఎగబాకింది. పొరుగున ఉన్న తెలంగాణలో నేరాల సంఖ్య, రేటు కూడా ఏపీతో పోలిస్తే తక్కువగా ఉంది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో తొలిసారి మొత్తం నేరాల సంఖ్య 2,38,105కు చేరింది. 2016-19 మధ్య ఎప్పుడూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఆ నాలుగేళ్లలో 2017లో మాత్రమే అత్యధికంగా 1,48,002 కేసులు నమోదయ్యాయి. 2019లో రాష్ట్రంలో 1,45,751 నేరాలు నమోదు కాగా.. 2020లో ఆ సంఖ్య 2,38,105గా ఉంది. 163.42 శాతం మేర నేరాలు పెరిగాయి.
రాష్ట్రంలో అత్యాచారాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2018లో 971 అత్యాచారాలు నమోదు కాగా, 2019లో 1,086, 2020లో 1,095 నేరాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున రోజుకు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక దిశ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా.. కూడా ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. హత్యలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 2019లో 870 హత్యలు జరగ్గా.. 2020లో 853 నమోదయ్యాయి.